బాలీవుడ్వైరల్సినిమా

కరీనాకు గర్భం కూడ అడ్డుకాలేదు.. సోషల్ మీడియాలో వైరల్

Pregnant Kareena Kapoor Shooting Videos and Photos
బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో మంచి కమిట్మెంట్ ఉన్న నటి కరీనా కపూర్. ఆమెలోని కష్టపడే తత్వమే ఆమెను ఇప్పటికీ స్టార్ హీరోయిన్ హోదాలోనే ఉండేలా చేసింది. సైఫ్ అలీ ఖాన్ తో వివాహమైన తర్వాత, ఒక కుమారుడు పుట్టాక కూడ ఆమె నటనకు బ్రేక్ ఇవ్వలేదు. మొదటి బిడ్డ పుట్టాక కొన్ని నెలలు ఇంటికే పరిమితమైన ఆమె తర్వాత వర్కవుట్స్ చేసి నాజూగ్గా తయారై సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చింది. వరుసపెట్టి సినిమాలు చేస్తోంది.

Also Read: తేజ్ ఎందుకు టెంప్ట్ అయ్యాడో ఇప్పుడు తెలిసింది

అయితే తాజాగా తాను రెండవసారి గర్భవతి ఆయిన విషయాన్ని కరీనా బయటపెట్టింది. ఇప్పుడు ఆమెకు నెలలు కూడ నిండాయి. ఎవరైనా ఇలాంటి సమయంలో విశ్రాంతి తీసుకుంటారు. పైగా కోవిడ్ ప్రభావం ఇంకా తగ్గలేదు కాబట్టి పూర్తిగా ఇంటికే పరిమితమవుతారు. కానీ కరీనా మాత్రం అలా చెయ్యట్లేదు. అవేమీ పట్టించుకోకుండా షూటింగ్లో పాల్గొంటోంది. ఇటీవలే తన సోదరి కరీష్మాతో కలిసి ఒక వాణిజ్య ప్రకటన చిత్రీకరణలో పాల్గొంది కరీనా కపూర్.

Also Read: ఎన్టీఆర్ ముస్లిం గెటప్ తీయడం కుదరదట

ఆ ఫోటోలను కరీష్మా సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది. అవి బాగా వైరల్ అయ్యాయి. ఫోటోల్లో కరీనా నిండు గర్భంతో కనిపిస్తోంది. అవి చూసిన నెటిజన్లు అలాంటి సమయంలో పనిచేయడం చాలా కష్టం. అయినా కరీనా షూటింగ్ చేస్తోంది. నిజంగా ఆమె కమిట్మెంట్ గొప్పది అంటూ కితాబిస్తున్నారు. ఇంకొందరైతే ప్రేమగా జాగ్రత్తలు చెబుతున్నారు.

Back to top button