ఆరోగ్యం/జీవనం

గర్భిణీలు కాఫీ తాగితే ఆ ఆరోగ్య సమస్యలు వస్తాయా..?

Coffee Impact On Pregnant Ladies

గర్భిణీ స్త్రీలు తీసుకునే ఆహారం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలనే సంగతి తెలిసిందే. గర్భిణీ స్త్రీలు కొన్ని ఆహార పదార్థాలను తీసుకుంటే పుట్టబోయే పిల్లలపై ప్రభావం పడి పుట్టబోయే పిల్లలకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంటుంది. గర్భిణీ స్త్రీలు కాఫీని ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోకూడదు. శాస్త్రవేత్తలు తాజాగా చేసిన ఒక అధ్యయనంలో కాఫీ పుట్టబోయే పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతుందని వెల్లడైంది.

Also Read: గంజి తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మీకు తెలుసా..?

2,000 మందికి పైగా గర్భిణీ స్త్రీలపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి ఈ విషయాలను వెల్లడించారు. రోజుకు సగం కప్పు కాఫీ తాగినా పిల్లలకు ప్రమాదమేనని శాస్త్రవేత్తలు చెబుతుండటం గమనార్హం. శాస్త్రవేత్తలు పరిశోధనలో భాగంగా 8 నుంచి 13 వారాల గర్భిణీల బ్లడ్ శాంపిల్స్ ను సేకరించారు. బ్లడ్ శాంపిల్స్ సేకరించిన వారిలో కెఫైన్ మోతాదు ఎక్కువగా ఉన్న గర్భిణీలను గుర్తించారు.

శాస్త్రవేత్తలు ఆ గర్భిణీలు బిడ్డకు జన్మనిచ్చిన తరువాత కాఫీ ఎక్కువగా తాగిన మహిళలకు పుట్టిన బిడ్డలు 84 గ్రాముల తక్కువ బరువు, పరిమాణంతో జన్మించారని గుర్తించారు. తక్కువ బరువు, తక్కువ పరిమాణంతో పుట్టే పిల్లలకు భవిష్యత్తులో డయాబెటిస్, ఒబెసిటీ, ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. కెఫైన్ ఎక్కువగా తీసుకునే తల్లి నుంచి బిడ్డకు రక్తప్రసరణ విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయని వైద్యులు వెల్లడిస్తున్నారు.

Also Read: పరగడుపున రాగిజావ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే..?

గర్భంలో ఉన్న చిన్నారుల స్ట్రెస్ హార్మోన్లపై కూడా కెఫైన్ ప్రభావం చూపుతుందని శాస్త్రవేత్తలు చెబుతుండటం గమనార్హం. గర్భిణీ స్త్రీలు కెఫైన్ కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Back to top button