జాతీయం - అంతర్జాతీయంబ్రేకింగ్ న్యూస్

300 ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుకు సన్నాహాలు

Preparations for setting up of 300 oxygen plants

ఉత్తర్ ప్రదేశ్ లో 300 ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుకు సన్నాహాలు చేపట్టామని సీఎం యోగి ఆదిత్యానాథ్ వెల్లడించారు. ఆక్సిజన్ సరఫరాలపై ఆధారపడటం ఒక్కటే పరిష్కారం కాదని, ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుకు పూనుకున్నామని చెప్పారు. కొవిడ్ సెకండ్ వేవ్ విరుచుకుపడుతున్న వేళ యూపీకి మెడికల్ ఆక్సిజన్ సరఫరాలకు ప్రత్యేక రైళ్లను నడపడం పట్ల కేంద్ర ప్రభుత్వానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. యూపీలో ఒక్కసారిగా ఆక్సిజన్ కు డిమాండ్ పెరిగిందని డిమాండ్ కు అనుగుణంగా ఆక్సిజన్ సరఫరాలు పెంచేందుకు చర్యలు చేపట్టామని చెప్పారు.

Back to top button