సినిమా వార్తలు

సెన్సేషన్ బ్యూటీ ‘ఇష్క్’ సంగతులు.. ప్రాక్టీస్‌ చేసి వచ్చేదట !

Priya Prakash Varrier
సోషల్ మీడియా పుణ్యమా అని ఓవర్ నైట్ లోనే ఫుల్ క్రేజ్ సంపాదించింది సెన్సేషన్ బ్యూటీ ‘ప్రియా ప్రకాష్ వారియర్’. ప్ర‌స్తుతం ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్ హీరోయిన్ గా, యంగ్ హీరో తేజ స‌జ్జా హీరోగా చేస్తోన్న సినిమా ‘ఇష్క్’. ఎన్నో విజయవంతమైన సినిమాలను తెరకెక్కించిన మెగా సూప‌ర్ గుడ్ ఫిలిమ్స్ కొంత కాలం విరామం త‌ర్వాత, తెలుగులో నిర్మిస్తోన్న ఈ చిత్రానికి య‌స్‌.య‌స్‌. రాజు అనే కొత్త ద‌ర్శ‌కుడు దర్శకత్వం వహించాడు. అయితే ఏప్రిల్ 23న ఈ చిత్రం విడుదల సంద‌ర్భంగా ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్ మీడియాతో ముచ్చ‌టించింది.

కాగా ఈ అమ్మడు చెప్పిన కొన్ని ఆసక్తికరమైన విశేషాలు ఏమిటంటే.. ఈ ఇష్క్ మూవీలో తన పాత్ర అనసూయ అనే విలేజ్ అమ్మాయి పాత్ర అట. త‌ను సెల్ఫ్ రెస్పెక్ట్‌ ఉన్న కాలేజ్‌ గాళ్‌ గా కనిపిస్తోందట. ఇక ఈ మూవీ ఆఫర్ తనకు అనుకోకుండా వచ్చిందని.. అయితే ఆ టైంలో ఈ సినిమా చేయాలని ప్లాన్‌ కూడా చేసుకోలేదని.. కాకపోతే, మెగాసూపర్‌ గుడ్‌ ఫిలింస్‌ వంటి మంచి బ్యానర్ ‌లో సినిమా చేస్తే.. అది తన కెరీర్‌కు ఫ్లస్‌ అవుతుందని వెంటనే ఇష్క్‌ సెట్స్‌ లో జాయినైపోయాను అంటూ ఈ బ్యూటీ చెప్పుకొస్తోంది.

ఇక ఈ సెన్సేషన్ హీరోయిన్ తెలుగు డైలాగ్స్ ‌ పలకడం ఇప్పుడిప్పుడే నేర్చుకుంటుందట. ఇష్క్‌ సినిమా చేసేప్పుడు డైలాగ్స్‌ తీసుకుని తెలుగులో ప్రాక్టీస్‌ చేసి సెట్స్‌కు వచ్చేదట. ప్రస్తుతానికి తెలుగు బాగా నేర్చుకునే పనిలో ఉందట. ఇక తన తదుపరి సినిమాల గురించి చెబుతూ.. సందీప్‌ కిషన్ నెక్ట్స్‌ మూవీలో ఓ కీలక పాత్ర చేస్తుందట. నిజానికి సోషల్ మీడియా వల్ల ఫుల్ క్రేజ్ వచ్చిన కొత్తల్లో ఈ సెన్సేషన్ బ్యూటీకి క్రేజ్ కి తగ్గట్టుగానే మంచి ఆఫర్లు వచ్చాయి.

అయితే అప్పుడు అమ్ముడికి ఆశ ఎక్కువై భారీగా రెమ్యునరేషన్ ను డిమాండ్ చేసింది. దాంతో వచ్చిన అవకాశాలు దూరమయ్యాయి. ఈ లోపు ఆమె హీరోయిన్ గా నటించిన ‘ఓరు అదార్ లవ్’ చిత్రం ‘లవర్స్ డే’ పేరుతో తెలుగులోకి డబ్ అయి అట్టర్ ఫ్లాప్ అయింది. ఆ సినిమా దెబ్బతో ఇక ఆమెకు ఆఫర్లు అసలే లేకుండా పోయాయి. అప్పటికీ గానీ తత్త్వం బోధపడలేదు ఈ యంగ్ బ్యూటీకి. ఇచ్చినంతే పుచ్చుకుంటా మీ సినిమాలో ఒక ఛాన్స్ ఇవ్వండి అంటూ ప్రస్తుతం అవకాశాలు వెతుక్కుంటుంది.

Back to top button