అప్పటి ముచ్చట్లుసినిమా వార్తలు

దర్శక దిగ్గజాన్ని అవమానించిన అగ్రనిర్మాత !

Kodi Rama krishna
తెలుగు సినిమాకి గ్రాఫిక్స్ ను అద్దిన దర్శక దిగ్గజాన్ని, ఒక మేరుపర్వతం లాంటి అగ్ర నిర్మాత అవమానించిన సంఘటన ఇది. సుమారు ముప్పై ఐదేళ్ల క్రితం మాట ఇది. తెలుగులో అప్పుడు కుటుంబ మరియు ప్రేమకథా చిత్రాలు, అలాగే పౌరాణికాలు ఒక ఊపు ఊపుతున్న కాలం అది. ఏ జోనర్ లో సినిమా చేసినా.. అప్పటి ప్రేక్షకులు ఆ సినిమాకి బ్రహ్మరథం పట్టేవారు. నిజానికి సినిమా కాస్త అటు ఇటుగా ఉన్న ఆ సినిమాను ఆదరించేవారు. పైగా అప్పట్లో ఒక్కో జోనర్ కి ఒక్కో స్పెషల్ డైరెక్టర్ ఉండేవాడు. పురాణాలకు కె.వి.రెడ్డి, సోషల్ డ్రామాకి ఆదుర్తి సుబ్బారావు, కమర్షియల్ సినిమాకి దాసరి నారాయణ రావు ఇలా ఎవరికీ వారు తమ ప్రత్యేకతను చాటుకుంటూ సాగారు.

ఆ తరువాత కాలంలోనే వచ్చాడు ఓ కుర్ర దర్శకుడు, ముప్పై ఏళ్ళు ఉంటాయనుకుంటా అతనికి. కాస్త పొట్టిగా ఉన్నాడు. ఆ కుర్ర డైరెక్టర్ ను బాగా గమనించిన.. అప్పటి నిర్మాతల్లోనే అగ్ర నిర్మాత .. ఏమయ్యా నువ్వేనా డైరెక్టరూ.. నీకు కథ రాయడం వచ్చా.. ? రాదు అండి. కానీ సినిమాని బాగా ఇస్తాను అన్నాడు ఆ కుర్రాడు. రాయడం రానోడివి నువ్వేం తీస్తావయ్యా ?. డైరెక్షన్ అంటే ముందు అర్ధం తెలుసుకుని సినిమాలు తీయండయ్యా ? అంటూ ఆ నిర్మాత చిరాకు పడ్డాడు. ఆ మాటకు ఆ కుర్ర డైరెక్టర్.. సినిమాకి అర్ధం తెలిస్తే.. మీరెందుకు ప్లాప్ లు తీశారు అండి ? అంటూ ఎదురు ప్రశ్న వేసి.. కానీ అర్ధం తెలియకపోయినా నేను ప్లాప్ లు తీయను అన్నాడట.

అంతే ఆ అగ్ర నిర్మాతకు కోపం కట్టలు తెచ్చుకుంది. ఒక్క హిట్ సినిమానే తీయలేదు, నీకు అప్పుడే అంత కోపమా ? నీ మొహంలే.. వెళ్లి ముందు ఒక సినిమాతోనైనా హిట్ కొట్టు. అప్పుడు చూద్దాంగా.. అంటూ అందరి ముందు ఆ నిర్మాత హేళనగా మాట్లాడాడట. కట్ చేస్తే.. నాలుగేళ్లు గడిచిపోయాయి. ఆ కుర్ర దర్శకుడు టాప్ డైరెక్టర్ అయిపోయాడు. సూపర్ హిట్స్ కొట్టాడు. అతనే ‘కోడి రామకృష్ణ’. ఆ నిర్మాతే ఎంయస్ రెడ్డి.

ఒకరోజు రెడ్డిగారు ‘కోడి రామకృష్ణ’ అఫీస్ కి వచ్చి వెయిట్ చేస్తున్నారు, సినిమా చేసి పెట్టమని అడగడానికి. అది తెలిసిన ‘కోడి రామకృష్ణ’ ఆయన దగ్గరకి వెళ్లి ఆశీర్వాదం తీసుకుని.. మీరు అన్న మాటలు వల్లే నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాను అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారట. ఆ తరువాత వీరిద్దరి కలయికలో ఎన్నో మంచి సినిమాలు వచ్చాయి, ముఖ్యంగా ‘అమ్మోరు’ సినిమా చరిత్రలో నిలిచిపోయింది.

Back to top button