వ్యాపారము

పోస్టాఫీస్ సూపర్ స్కీమ్.. రూ.300 ఆదాతో కోటి రూపాయలు..?

పోస్టాఫీస్ ఎన్నో స్కీమ్స్ ను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ స్కీమ్స్ లో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ ఒకటి కాగా దీర్ఘకాల ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్ లలో ఒకటైన ఈ స్కీమ్ బెస్ట్ రిటైర్మెంట్ స్కీమ్ అని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ స్కీమ్ పై ఏకంగా 7.1 శాతం వడ్డీ రేటు లభిస్తుండగా పోస్టాఫీస్ లేదా బ్యాంక్‌కు వెళ్లి పీపీఎఫ్ ఖాతాను సులభంగా ఓపెన్ చేయవచ్చు. ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఎటువంటి రిస్క్ లేదు.

ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయడం వల్ల పన్ను మినహాయింపు ప్రయోజనాలను కూడా పొందే అవకాశం అయితే ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ప్రతి 90 రోజులకు ఒకసారి వడ్డీ రేట్లలో స్వల్పంగా మార్పులు చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం ప్రతి త్రైమాసికంలో వడ్డీ రేట్లను పెంచడం లేదా తగ్గించడం లేదా స్థిరంగా ఉంచడం చేస్తుంది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ ప్రకారం గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు తగ్గింపు బెనిఫిట్స్ ను పొందవచ్చు.

పీపీఎఫ్ స్కీమ్ మెచ్యూరిటీ కాలం 15 సంవత్సరాలు కాగా అవసరమైతే మెచ్యూరిటీ స్కీమ్ ను ఐదేళ్ల చొప్పున పొడిగించుకుంటూ వెళ్లవచ్చు. . పీపీఎఫ్ క్యాలిక్యులేటర్ ప్రకారం రోజుకు కేవలం 3 00 రూపాయల చొప్పున ఆదా చేసి నెల చివరిలో రూ.9 వేలను పీపీఎఫ్ అకౌంట్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఇలా 30 సంవత్సరాలు పీపీఎఫ్ అకౌంట్ లో ఇన్వెస్ట్ చేస్తే సులభంగా కోటీశ్వరులు అయ్యే అవకాశం అయితే ఉంటుంది.

భవిష్యత్తు అవసరాల కొరకు ఎక్కువ సంవత్సరాలు ఇన్వెస్ట్ చేసేవాళ్లకు ఈ స్కీమ్ బెస్ట్ స్కీమ్ అని చెప్పవచ్చు. దీర్ఘకాలంలో ఆదాయం పొందాలని అనుకునే వాళ్లు ఈ స్కీమ్ కొరకు దరఖాస్తు చేసుకుంటే మంచిది.

Back to top button