వ్యాపారము

బ్యాంక్ అకౌంట్ తెరిస్తే రూ.3 లక్షలు.. ఎలా అంటే..?

PNB Salary Account Latest Updates

దేశంలోని ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకులలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఒకటి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఉద్యోగులకు మై శాలరీ అకౌంట్ పేరుతో అకౌంట్ ను అందిస్తోంది. ఉద్యోగుల కోసం పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఈ అదిరిపోయే సర్వీసులను అందిస్తుండటం గమనార్హం. మై శాలరీ అకౌంట్ జీరో బ్యాలెన్స్ అకౌంట్ కావడంతో ఈ అకౌంట్ ఓపెన్ చేయడానికి ఎటువంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవాళ్లు కార్పొరేట్, పేరున్న ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో పని చేసే ఉద్యోగులు పంజాబ్ నేషనల్ బ్యాంక్ మై శాలరీ అకౌంట్ ను ఓపెన్ చేయవచ్చు. శాలరీ అకౌంట్‌లో 4 రకాలు ఉండగా ఉద్యోగి వేతనాన్ని బట్టి సిల్వర్, గోల్డ్, ప్రీమియం, ప్లాటినం అకౌంట్లను పొందే అవకాశం ఉంటుంది. రూ.10 వేల నుంచి రూ.25 వేల మధ్యలో జీతం ఉన్నవాళ్లు సిల్వర్ అకౌంట్ ను తీసుకోవాల్సి ఉంటుంది.

రూ.25,001 నుంచి రూ.75 వేల వరకు జీతం ఉంటే గోల్డ్ అకౌంట్ ను తీసుకోవచ్చు. రూ.75,001 నుంచి రూ.1.5 లక్షల వరకు జీతం వస్తే ప్రీమియం అకౌంట్ ను తీసుకోవచ్చు. లక్షన్నర రూపాయల కంటే ఎక్కువ వేతనం తీసుకునే వాళ్లు ప్లాటినం అకౌంట్ ను తీసుకోవాల్సి ఉంటుంది. ఈ అకౌంట్ ఉన్నవాళ్లకు 3 లక్షల రూపాయల వరకు బెనిఫిట్ ను పొందే అవకాశం ఉంటుంది.

పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో అకౌంట్ ను ఉన్నవాళ్లు 3 లక్షల రూపాయల వరకు ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీని పొందవచ్చు. ఉద్యోగుల రెండు నెలల శాలరీకి సమానంగా ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయం పొందే అవకాశం ఉంటుంది. ఈ ఖాతా అకౌంట్ ఉన్నవాళ్లు 20 లక్షల రూపాయల వరకు ఉచిత ప్రమాద బీమాను పొందే అవకాశం ఉంటుంది.

Back to top button