క్రీడలు

పంజాబ్ సిక్సుల వర్షం:పోరాడి ఓడిన రాజస్థాన్

Punjab Sixes: Rajasthan Target 222

ఐపీఎల్ లో ఈరోజు సిక్సుల వర్షం కురిసింది. రాజస్థాన్ రాయల్స్ తో తలపడ్డ పంజాబ్ కింగ్స్ బ్యాట్స్ మెన్ రెచ్చిపోయారు. సిక్సుల మీద సిక్సులు కొట్టి ఊగిపోయారు.

పంజాబ్ బ్యాట్స్ మెన్ సిక్సులతో ముంబైలోని వాంఖడే స్టేడియం దద్దరిల్లిపోయింది. ముఖ్యంగా పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ 91, దీపక్ హుడా 64 పరుగులతో దంచికొట్టారు.

వీరిలో దీపక్ హుడా 20 బంతుల్లోనే 50 పరుగులు చేసి దడ పుట్టించాడు. రాజస్థాన్ బౌలర్లను ఉతికి ఆరేశాడు. ఆ తర్వాత కేఎల్ రాహుల్ సైతం 50 బంతుల్లోనే 91 పరుగులు చేయడంతో పంజాబ్ ఏకంగా 221/6 పరుగుల భారీ స్కోరు సాధించింది. కేఎల్ రాహుల్ తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు.

చివరకు పంజాబ్ 20 ఓవర్లలోనే 221 పరుగుల భారీ స్కోరు సాధించింది. అంతకుముందు ఓపెనర్లు మయాంక్ అగర్వాల్ 14 ఔట్ అయ్యాడు. వన్ డౌన్ లో వచ్చిన క్రిస్ గేల్ 28 బంతుల్లోనే 40 పరుగులు చేశాడు.

ఇక అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన రాజస్థాన్ ఆదిలోనే బెన్ స్టోక్ డకౌట్ కావడంతో కష్టాల్లో పడింది. వోహ్రా 12 పరుగులకే ఔట్ అయ్యాడు. కెప్టెన్ సంజు శాంసన్ , శివం ధూబే బ్యాటింగ్ చేస్తున్నారు. 8 ఓవర్లలో 84/3 వికెట్లతో ఆడుతోంది. 222 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్ అందుకోవడం కష్టంగానే కనిపిస్తోంది. అయితే రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ 119 పరుగులతో ఒంటరి పోరాటం చేశాడు. చివరి వరకు లాక్కొచ్చాడు. చివరి బంతికి 5 పరుగులు కొట్టాల్సిన సమయంలో ఔట్ అయ్యాడు. కానీ ఏకంగా కెప్టెన్ గా తొలి సెంచరీ చేసి అదరగొట్టాడు. ఓడినా కూడా రాజస్థాన్ రాయల్స్ పోరాడి ఆకట్టుకుంది.

Back to top button