గుసగుసలుసినిమా

‘ఫైటర్’ కోసం రంగంలోకి పూరి జగన్నాథ్

Puri's Tweet

టాలీవుడ్ లో విజయ్ దేవరకొండకు క్రేజీ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. దీంతో ఆయన సినిమాలు ఎప్పుడెప్పుడస్తాయా అని అభిమానులు ఎదురుచూస్తుంటారు.

Also Read: ప్రభాస్-నాగ్ అశ్విన్ మూవీ తాజా అప్ డేట్ ఇదే

కాగా విజయ్, పూరి జగన్నాథ్ కాంబినేషన్ ‘ఫైటర్’ తీస్తున్న విషయం తెలిసిందే. కరోనా కారణంగా ఆగిపోయిన ఈ సినిమా చిత్రీకరణ తాజాగా పున: ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా జనవరిలో చిత్రం ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం తదుపరి షెడ్యూల్ త్వరలోనే హైదరాబాద్ లో ప్రారంభమవుతుంది. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన సెట్ వర్క్ జరుగుతోంది.

ప్రస్తుతం దర్శకుడు పూరి ప్రస్తుతం ఈ సినిమా నేపథ్యం సంగీతం కోసం మణిశర్మతో కలిసి మ్యూజిక్ సిట్టింగ్స్ లో కూర్చుంటున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే సినిమా సాంగ్స్ కూడా పూర్తయ్యాయట.. వచ్చే షెడ్యూల్ లోనే సాంగ్ షూట్ చేయనున్నారు. అక్కడ కొన్ని యాక్షన్ సీన్లు తీయనున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ డాన్ కుమారుడిగా నటించనున్నారు. విజయ్ సరసన అనన్య పాండే అలరించనుంది.

Also Read: ‘ఆర్ఆర్ఆర్’ టీజర్ రెడీ.. అభిమానులకు రాజమౌళి సర్ ప్రైజ్?

ఇక సినిమాను పాన్ ఇండియా మూవీగా తీస్తున్నారు. హిందీ, తెలుగు, దక్షిణాది భాషలలో రిలీజ్ చేస్తున్నారు. విజయ్ ఈ సినిమాతో హిందీలో ఎంట్రీ ఇస్తున్నాడు. కరణ్ జోహర్ ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామిగా ఉన్నాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

Back to top button