వైరల్సినిమాసినిమా వార్తలు

పుష్ప టీజర్: అల్లు అర్జున్ మాస్ కా బాప్

Pushpa Teaser : Stylish Star to Mass Ka Baap

Pushpa Movie

మెగా అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘పుష్ప’ టీజర్ కు రిలీజ్ కు రెడీ అయ్యింది. అల్లు అర్జున్ ‘పుష్పా’ ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కింది. భారతదేశం అంతటా ఈ సినిమాపై ఎంతో ఆసక్తి ఉంది. స్టార్ డైరెక్టర్ సుకుమార్ తీస్తున్న ఈ చిత్రం ఎక్కువగా చిత్తూరు అడవులలో గంధపు చెక్కల అక్రమ రవాణా చుట్టూ కథ తిరుగుతుంది. ఈ సినిమా టీజర్ కొద్ది నిమిషాల్లో విడుదల అవుతుంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులు తమ అభిమాన హీరో నుండి ఈ సినిమా ద్వారా మాస్ యాక్షన్ లుక్ లో చించేస్తాడని తెగ ఆరాటపడుతున్నారు.

ఇప్పుడే ‘ఉప్పెన’ దర్శకుడు, సుకుమార్ శిష్యుడు బుచి బాబు సనా ఈ టీజర్ చూసిన తర్వాత ట్వీట్ చేశాడు. “ఇప్పుడే పుష్ప టీజర్ చూశాను. బన్నీ సార్ మరియు సుకుమార్ సర్ రాజీపడరు. మాస్ కా బాప్ లా టీజర్ ఉంది. ఐకానిక్ స్టార్ అని చెప్పొచ్చు ”అని బుచ్చిబాబు ట్వీట్ చేశారు. దీంతో అభిమానుల అంచనాలు ఆకాశాన్ని అంటాయి.

ఈ మూవీలో రష్మిక మండన్న, ఫహద్ ఫాసిల్ ప్రధాన పాత్రల్లో నటించారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది. అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా, అల్లు అర్జున్ అభిమానులు మరియు సినీ ప్రేక్షకుల కోసం టీజర్ ను చిత్రం యూనిట్ కొద్దిసేపట్లో విడుదల చేయబోతోంది.

https://twitter.com/BuchiBabuSana/status/1379765000898678785?s=20

Back to top button