అప్పటి ముచ్చట్లుటాలీవుడ్సినిమాసినిమా వార్తలు

R. P. Patnaik: అప్పటి ముచ్చట్లు : నాగార్జున వల్లే ఆయన కెరీర్ పోయిందా !

ఆర్ పి పట్నాయక్ అనే కుర్రాడు అద్భుతమైన సంగీతంతో ఒక ఊపు ఊపేశాడు. 1999లో వచ్చిన 'నీ కోసం' సినిమాతో

R. P. Patnaik: Stopped Composing Music All Of A Sudden

R. P. Patnaik: ఒకప్పుడు.. అంటే, ఇరవై ఏళ్ల క్రితం.. ఆర్ పి పట్నాయక్ అనే కుర్రాడు అద్భుతమైన సంగీతంతో ఒక ఊపు ఊపేశాడు. 1999లో వచ్చిన ‘నీ కోసం’ సినిమాతో గొప్ప పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత దర్శకుడు తేజతో వరుసగా విజయవంతమైన సినిమాలు చేసి, స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఫుల్ సక్సెస్ అయ్యాడు.

ఓ దశలో మణిశర్మ, కీరవాణిలతో పోల్చుకునే స్థాయిలో పట్నాయక్ ఎదిగారు. పైగా వారితో పోల్చుకుంటే ఆర్పీ చేసిన సినిమాలు చాలా తక్కువ. అన్నిటికీ మించి సంగీతం పరంగా, బిజినెస్ పరంగా కూడా ఎన్నో మంచి హిట్స్ ఉన్నా.. కొన్ని కారణాల కారణంగా ఆర్ పి పట్నాయక్ ఒక స్టార్ సంగీత దర్శకుడిగా బ్రాండ్ ను క్రియేట్ చేసుకోలేకపోయాడు.

దీనికి తోడు 2004లో నాగార్జున ‘నేనున్నాను’ సినిమా విషయంలో జరిగిన ఓ చిన్న పొరపాటు ఆయన కెరీర్ కి అతి పెద్ద దెబ్బ అయింది. ఆ సినిమా ఆఫర్ మొదట ఆర్ పీ కే వచ్చింది. కానీ ఆర్ పి పట్నాయక్ చెప్పకుండా ఫారెన్ వెళ్ళాడు. సినిమాకి మ్యూజిక్ చేయడంలో లేట్ అవుతుందేమో అని వెంటనే ఆయన్ని తీసేసి.. ఎం ఎం కీరవాణి గారిని తీసుకున్నారు.

ఒక రకంగా ఇది ఆర్ పి పట్నాయక్ పెద్ద షాకే. ఇక అప్పటి నుంచి ఆయన డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది. అయితే నాగ్ వల్లే ఆర్ పి పట్నాయక్ కెరీర్ పోయింది అని ఆ మధ్య రూమర్స్ వినిపించాయి. కానీ ఈ విషయంలో నాగార్జునకి ఎలాంటి సంబంధం లేదు, ఆర్ పీ ఉంటే సినిమాకి పెద్దగా వ్యాపారం జరుగదు, అదే కీరవాణి ఉంటే ఎక్కువ రేటుకి పాటలు అముకోవచ్చు అని సదరు నిర్మాతలు అభిప్రాయ పడటంతో ఆర్ఫీ ఇక తప్పక ఆ సినిమా నుంచి తప్పుకున్నారు.

అదే సమయంలో ఒక మ్యూజికల్ టూర్ కోసం విదేశాలకి వెళ్లాల్సి రావడంతో పవన్ కళ్యాణ్ గుడుంబా శంకర్ ని వదులుకోవాల్సి వచ్చింది. దాంతో ఆర్పీ పెద్ద సినిమాలకు పనికి రాడు అనే పేరు పడ్డాడు. దీనికితోడు నటుడిగా, దర్శకుడిగా కొత్త ఇన్నింగ్స్ ఆరంభించడం కూడా ఆర్పీకి అవకాశాలు లేకుండా చేశాయి.

Back to top button