జాతీయంరాజకీయాలు

Rahul Gandhi: ట్విటర్ పై రాహుల్ గాంధీ ఆగ్రహం

Rahul Gandhi

ట్విటర్ పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తన ఖాతా స్తంభింపచేయడంపై నిరసన తెలిపారు. ట్విటర్ పక్షపాతంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యంలో ప్రజా సమస్యలపై స్పందిస్తే సామాజిక మాధ్యమ ఖాతా ఆపేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. దేశరాజకీయాల్లో ఒక సంస్థ జోక్యం చేసుకోవడం ఏమిటని అడుగుతున్నారు. సదరు సంస్థ మనకే రాజకీయాలు బోధిస్తోందని చెప్పారు.

ఢిల్లీలో హత్యకు గురైన దళిత కుటుంబానికి చెందిన బాలిక కుటుంబాన్ని పరామర్శించి దానికి సంబంధించిన చిత్రాలను ట్విటర్ లో పెట్టినందుకు తనపై కక్షపూరితంగా వ్యవహరిస్తూ తన ఖాతా నిలిపివేయడంపై రాహుల్ గాంధీ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తాను ఏం మోసాలు చేయడం లేదని దుయ్యబట్టారు. ప్రజాసమస్యలపై స్పందిస్తే ట్విటర్ తన ఖాతాను ఆపేయడం ఏమిటని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారిక ఖాతాతోపాటు ఆ పార్టీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలకు చెందిన మరో ఐదు వేల ఖాతాలు ట్విటర్ నిలిపివేసిది.

ఈ పరిణామాలపై స్పందించిన రాహుల్ గాంధీ యూట్యూబ్ చానల్ లో వీడియో సందేశం విడుదల చేశారు. ట్విటర్ సామాజిక మాధ్యమ సంస్థ కాదని ఓ పక్షపాత ప్రభుత్వ పక్షపాత వేదిక అని విమర్శించారు. ట్విటర్ తన విధులు పక్కనపెట్టి రాజకీయ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మనకు రాజకీయాలు నేర్పేందుకు నేను అంగీకరించను అని చెప్పారు. మన ప్రజాస్వామ్య వ్యవస్థ మీద జరుగుతున్న దాడిని అడ్డుకోవడం మన బాధ్యత అని పేర్కొన్నారు.

ట్విటర్ తన పని తాను చేసుకోకుండా అనవసరంగా రాజకీయాల వైపు దృష్టి సారిస్తోందని రాహుల్ గాంధీ అన్నారు. మన రాజకీయాలను మనమే నిర్వహించుకుంటామని చెబుతున్నారు. పార్లమెంట్ లో మాట్లాడనివ్వడం లేదు. బయట కూడా నోరిప్పకుండా చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్రం తీరుకు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యంలో పరాయి వారి పెత్తనం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

Back to top button