అత్యంత ప్రజాదరణటాలీవుడ్సినిమా

దౌర్భాగ్యంలో హీరో.. కూలీలా రోజుకూ ఇంత అని !

Raj Tarun
నాలుగేళ్ల క్రితం ‘రాజ్ తరుణ్’కి నిర్మాతలు అడ్వాన్స్ లు ఇచ్చి మరీ, వరుసగా సినిమాలు చేయమని అతన్ని బుక్ చేసుకునేవాళ్ళు. పైగా అప్పట్లో రాజ్ తరుణ్ కి ఒక డైరెక్టర్ వెళ్లి కథ చెప్పడానికి చాలా కష్టపడాల్సి వచ్చేది. అంతగా రాజ్ తరుణ్ కి అప్పుడు డిమాండ్ ఉండేది. ఎంతైనా ‘ఉయ్యాలా జంపాలా’, ‘సినిమా చూపిస్తా మావ’, ‘కుమారి 21F’ లాంటి సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ అందుకున్నాడు కాబట్టి, సడెన్ గా లైం లైట్ లోకి వచ్చిన ఈ కుర్రాడి పై అప్పుడు బాగానే ఆసక్తి చూపించేవారు దర్శకనిర్మాతలు.

అయితే అదృష్టం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా. రాజ్ తరుణ్ కి బ్యాడ్ టైం మూడేళ్ళ క్రితమే మొదలైపోయింది. ఏకంగా గత ఆరు సినిమాలు ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త, అంధగాడు, రంగుల రాట్నం, రాజుగాడు, లవర్, పవర్ ప్లే’ ఇలా మొత్తం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ డిజాస్టర్స్ గా నిలిచాయి. చివరికి దిల్ రాజు బ్యానర్ నుంచి వచ్చిన ‘లవర్’ కూడా భారీ ప్లాప్ అయిపోయింది. సినిమా పరిశ్రమలో హిట్ అనేది ఉంటేనే ఎవరైనా సర్వైవ్ అవ్వగలరు అని చివరకు రాజ్ తరుణ్ నిరూపించాడు.

తన మెయింటైన్స్ కోసం సేవింగ్స్ తీయడం ఇష్టం లేని ఈ హీరో, చిన్నాచితకా నిర్మాతల దగ్గరకు తానే వెళ్లి.. సినిమా చేస్తా ఇచ్చినంత తీసుకుంటా అని సినిమాలను సెట్ చేసుకుంటున్నాడట. తనకు హిట్స్ ఉన్న సమయంలో సుమారు రెండు కోట్లు వరకూ డిమాండ్ చేసి మరీ రెమ్యునరేషన్ తీసుకున్న ఈ హీరో, ఇప్పుడు రోజుకూ ఇంత అని తీసుకుంటున్నాడట. పరిస్థితులు రివర్స్ అయినా, అసలు తనకు రెమ్యునరేషనే ఇస్తా అని ఎవ్వరూ రాకపోయినా..

ఈ హీరో మాత్రం ప్రస్తుతం చేస్తోన్న రెండు సినిమాలకు గానూ రోజుకు లక్ష రూపాయిలు చొప్పున రెమ్యునరేషన్ ను తీసుకుంటున్నాడట. అంటే సినిమాకి ముప్పై రోజులు డేట్స్ ఇస్తే.. ముప్పై లక్షలు అన్నమాట. అలాగే సాంగ్స్ కోసం ఇచ్చిన డేట్స్ కి, సినిమా ప్రమోషన్స్ కోసం ఇచ్చిన డేట్స్ కి ఇక ఎలాంటి రెమ్యునరేషన్ ఉండదు అట. పాపం రాజ్ తరుణ్, దౌర్భాగ్యం కాకపోతే హీరో అయి ఉండి కూలీలా రోజుకూ ఇంత అని తీసుకోవడం ఏమిటి !

Back to top button