టాలీవుడ్ప్రత్యేకంసినిమాసినిమా వార్తలు

రజినీకాంత్ సేఫ్, కమల్ హాసనే బుక్ అయ్యాడు !

Rajini kamalసినిమాల్లో కనిపిస్తే విజిల్స్ వేశారు కదా అని, రాజకీయాల్లోకి వస్తే ఓట్లు వేస్తారనుకోవడం అమాయకత్వం. మొత్తానికి తమిళనాడు ఎన్నికల్లో రెండు విషయాలు స్పష్టంగా అర్థమయ్యాయి. జనం దృష్టిలో సినిమాలు వేరు, రాజకీయాలు వేరు. ముఖ్యంగా కమల్ హాసన్ పార్టీతో పాటు కమల్ కూడా ఓడిపోవడం అందర్నీ షాక్ కి గురి చేసింది. ఈ పరిస్థితిని ఈ సమాజంలో సర్వసాధారణం అనే సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయాలకు దూరంగా ఉన్నారేమో.

నిజానికి రజినీకాంత్ కి మొదటి నుంచి రాజకీయాల పై ఆసక్తి ఉంది. అందుకే ఆయన తన గత సినిమాల్లో తన రాజకీయ ఎంట్రీ పై తనదైన డైలాగ్ లు రాయించుకున్నారు. దీనికితోడు గత పదేళ్లుగా పార్టీ పెడతాను, తమిళనాడు ఎన్నికల్లో పోటీచేస్తాన అంటూ రజిని ప్రతి సభలో లెక్చర్లు దంచుతూ వచ్చాడు. అందుకే తన రాజకీయ ఎంట్రీ పై ఎంతో ఆర్భాటం చేసి, అలాగే భారీ ప్రకటనలు ప్రకటించాడు.

కానీ తమిళనాడులో ప్రస్తుతం ఉన్న రాజకీయాలను అర్ధం చేసుకుని చివరి నిమిషంలో రజినీకాంత్ రాజకీయాల నుండి తప్పించుకున్నారు. దాంతో రజినీకాంత్ పై ఆయన అభిమానులే ట్రోలింగ్ కి దిగారు. దాదాపు 20 ఏళ్ల పాటు ఊరించి తుస్సుమనిపించావంటూ ఎగతాళి చేశారు. కానీ రజినీకాంత్ అంత ఈజీగా రాజకీయాల నుండి తప్పుకోలేదు. ఆయన ఎన్నో సర్వేలు చేయించుకున్నారు.

రాజకీయ పార్టీ పెడితే.. తనకు ఎన్ని సీట్లు వస్తాయి అనే కోణంలో సర్వే చేయించుకున్న రజినీ, తన పార్టీ గెలవడం అసాధ్యం అని అర్ధం చేసుకున్నారు. అర్ధం అయిన తర్వాతే ఎన్నికల బరిలోకి దిగొద్దని రజిని డిసైడ్ అయ్యాడు. ఇప్పుడు తీరా తమిళనాడు అసెంబ్లీ ఫలితాలు వచ్చాక, రజినీకాంత్ నిర్ణయం సరైనదే అనే కామెంట్లు వస్తున్నాయి. పాపం కమల్ హాసన్ పార్టీ అడ్రెస్ లేకుండా పోయింది. హీరో కాస్త జీరో అవ్వాల్సి వచ్చింది.

Back to top button