టాలీవుడ్సినిమాసినిమా వార్తలు

వైరల్ అవుతోన్న రజనీకాంత్ షూటింగ్ పిక్ !

సూపర్‌స్టార్‌ రజనీకాంత్ మళ్ళీ హైదరాబాద్ లోనే మళ్లీ షూటింగ్‌లో పాల్గొనడానికి రెడీ అవుతున్నాడని ఇప్పటికే ఓకేతెలుగు.కామ్ తెలియజేసింది. కాగా రజిని షూటింగ్ లో పాల్గొన్నారు. తాజాగా సోషల్ మీడియాలో రజిని షూటింగ్ లో ఉండగా, దిగిన ఒక స్టిల్ ఒకటి బాగా వైరల్ అవుతుంది. స్వయంగా ‘అన్నాత్తే’ టీమే ఈ సినిమా వర్కింగ్ స్టిల్ ని షేర్ చేయడంతో రజిని అభిమానులు ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. భారీ ఆసక్తితో రజిని కొత్త చిత్రం ‘అన్నాత్తే’ (అన్నయ్య) సినిమా కోసం సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

కాగా మొత్తానికి ‘అన్నాత్తే’ షూటింగ్‌ మళ్ళీ స్టార్ట్ అయింది. నిజానికి గత ఏడాది చివర్లో హైదరాబాద్‌లో షూటింగ్ జరిగినప్పుడు యూనిట్‌లో నలుగురికి కరోనా రాకపోయి ఉండి ఉంటే.. ఈ పాటికి ఈ సినిమా షూటింగ్‌ పూర్తి అయ్యేది. మళ్ళీ ఆ తరువాత జనవరిలో షూటింగ్ తిరిగి ప్రారంభించాలి అని నిర్ణయించుకున్న తరువాత.. రజినికి ఆరోగ్య సమస్యలువచ్చాయి. ఇక ఈ సినిమా షూటింగ్ ఇప్పట్లో ఉండదు అనే అభిప్రాయం కూడా వచ్చింది.

రజిని ఫ్యాన్స్ కూడా ఈ సినిమా ఇక వచ్చే ఏడాదే ఉంటుందని అనుకున్నారు. కానీ రజనీ తన విశ్రాంతిని పక్కన పెట్టి షూట్ కి సిద్ధం అయ్యాడు. కేవలం తన అభిమానుల కోసమేనట. ఇప్పటికే ఈ సినిమాని నవంబరు 4న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. కాబట్టి, ఆ తేదీ కోసం ఫ్యాన్స్ కలలు కంటున్నారు. అందుకే ఫ్యాన్స్ ను బాధ పెట్టడం ఇష్టం లేకే.. అప్పటిలోగా షూటింగ్‌ ను పూర్తీ చేయాలనే రజిని షూట్ లో పాల్గొంటున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతుంది.

Back to top button