టాలీవుడ్సినిమాసినిమా వార్తలు

ఎన్టీఆర్ తో చరణ్ దోస్తీ ప్రయాణం !

Ram Charan Jr NTRక్రేజీ భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ‘ఎన్టీఆర్ – చరణ్’ పోటీ పడి మరీ ప్రమోషన్స్ చేస్తున్నారు. తాజాగా ఒక స్పెషల్ వీడియోను షేర్ చేసింది టీమ్. షూట్ కోసం ఎన్టీఆర్ – చరణ్ లు కార్ లో ప్రయాణం చేస్తూ దోస్తీ సాంగ్ వింటూ ఆ పాటలోని కొన్ని పదాలను తమలో తామే పాడుకుంటూ కనిపించారు. అయితే, ఆ సమయంలో ఈ వీడియో తీసిన టీమ్ దీన్ని కూడా ప్రమోషన్ కోసం వాడుకుంది.

రెండు రోజుల క్రితం కూడా ఇలాగే ఒక వీడియోను షేర్ చేసిన సంగతి తెలిసిందే. ఆ వీడియో ఎన్టీఆర్ వాయిస్ తో మొదలవుతూ.. ‘చరణ్ డ్రమ్స్ ప్రాక్టీస్ పూర్తి అయ్యిందా ?’ అని తారక్ అడగడం, చరణ్ వెంటనే అలర్ట్ అవుతూ బల్ల పై చేతులతో డ్రమ్స్ ప్రాక్టీస్ చేస్తూ హడావిడి చేయడం కాస్త ఫన్నీగా అనిపించింది. మొత్తానికి ఎన్టీఆర్ – చరణ్ ప్రమోషనల్ వీడియోలు సోషల్ మీడియాలో బాగానే వైరల్ అవుతున్నాయి.

ఇక యావత్తు తెలుగు సినీ లోకం ఆశగా ఎదురుచూస్తున్న ఈ సినిమా పై నేషనల్ లెవల్లో కూడా అంచనాలు రోజురోజుకు రెట్టింపు అవుతున్నాయి. మరోపక్క రాజమౌళి కూడా సినిమా పై ఉన్నహైప్ ను పెంచడానికి పక్కాగా ప్లాన్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. ఎలాగూ ‘ఎన్టీఆర్ – రామ్ చరణ్’ కలిసి మొదటిసారి సినిమా చేయడం, పైగా రామ్ చరణ్ సరసన బాలీవుడ్ క్రేజీ బ్యూటీ ఆలియా భట్ హీరోయిన్ గా నటిస్తుండటం,

అదేవిధంగా ఎన్టీఆర్ కి జోడీగా హాలీవుడ్ బ్యూటీ ఒలీవియా మోరిస్ నటిస్తుండటంతో ఈ సినిమాకి భారీ బిజినెస్ జరుగుతుంది. అన్నిటికీ మించి ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు. అందుకే, హిందీ జనం కూడా ఈ సినిమా పట్ల అమితమైన ఆసక్తిని పెంచుకున్నారు.

ఇక రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాని అక్టోబర్ 13న రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యాడు. మరి కరోనా అప్పటిలోపు పూర్తిగా తగ్గుతుందా అంటే డౌటే.

Back to top button