టాలీవుడ్సినిమా

చరణ్ కి నెగిటివ్.. ఎన్టీఆర్ తో షూట్ కి రెడీ !

Ram Charan
కరోనా మహమ్మారి నుండి పూర్తిగా కోలుకున్నానంటూ ‘మెగా పవర్ స్టార్ రామ్ చరణ్’, తన అభిమానులకు అఫీషియల్ గా ఒక పోస్ట్ పెట్టాడు. చరణ్ మాటల్లో “నాకు కరోనా నెగిటివ్ వచ్చింది. పూర్తిగా కోలుకున్నాను. ఇక త్వరలోనే పని మొదలుపెట్టేందుకు రెడీగా ఉన్నాను. నేను త్వరగా కోలుకోవాలని విషెస్ తెలిపిన మీ అందరికి కృతజ్ఞతలు,” అంటూ చరణ్ తన ఫ్యాన్స్ కు ఓ ప్రత్యేక లెటర్ ను రాసుకొచ్చాడు. అసలు, చరణ్ కి కరోనా రావడానికి కారణం.. గత నెలలో చెర్రీ ఒక పార్టీలో పాల్గొన్నాడు. ఆ పార్టీకి వెళ్లిన చాలా మందికి కరోనా సోకిందట. వారి వల్లే రామ్ చరణ్ కి, అలాగే వరుణ్ తేజ్ కి కూడా కరోనా సోకింది. ప్రస్తుతం వీరిద్దరూ కరోనాని జయించి షూటింగ్ రెడీ అయిపోయారు.

Also Read: ‘క్రాక్’ డైరెక్టర్ కి బాలయ్య ఫోన్ ?

కాగా రామ్ చరణ్ కి కరోనా రావడంతో ‘ఆర్ఆర్ఆర్’ కోసం చరణ్ కేటాయించిన డేట్స్ మిస్ అయ్యాయి. దాంతో మిగిలిన ఆర్టిస్ట్ ల డేట్స్ అన్ని క్యాన్సల్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కరెక్ట్ గా కాంబినేషన్ షాట్స్ ను ప్లాన్ చేసుకున్న సమయంలోనే చరణ్ కి కరోనా అని తేలింది. దాంతో, ఆర్ఆర్ఆర్ షూట్ ఒడిదుడుకుల్లో పడింది. అయితే, ప్రస్తుతం చరణ్ కి నెగిటివ్ రావడంతో.. మళ్ళీ ఆర్ఆర్ఆర్ షూట్ మొదలుకానుంది. సోమవారం నుండి గండిపేట ప్రాంతంలో వేసిన సెట్ లో ఎన్టీఆర్-చరణ్ లపై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.

Also Read: సూపర్ స్టార్ ను బాధ పెడుతున్న ఫ్యాన్స్ !

కాగా ఈ సెట్స్ గతంలోనే వేశారని, ఇప్పుడు ఈ సెట్స్ లోనే షూట్ ప్లాన్ చేశారట రాజమౌళి. అన్నట్టు ఇవి ఇంటర్వెల్ లో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ అట. ఏది ఏమైనా ఈ సినిమా పై రాజమౌళి మొదటినుండి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని, సినిమాని త్వరగా పూర్తి చేయాలని సన్నాహాలు చేస్తున్నా.. కొన్ని కారణాలు వల్ల ఎప్పటికప్పుడు సినిమా లేట్ అవుతూనే ఉంది. ఇక డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తూ.. మొత్తానికి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ముందుకువెళ్తున్నాడు. ఇక ఈ సినిమానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

Back to top button