టాలీవుడ్సినిమాసినిమా వార్తలు

‘ఆర్ఆర్ఆర్’లో చరణ్ లుక్ కి ఫ్యాన్స్ ఫిదా !

Ram Charanమొత్తానికి మూడు నెలల గ్యాప్ తర్వాత రామ్ చరణ్ షూటింగ్ సెట్ లోకి అడుగు పెట్టడంతో, ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ నాన్ స్టాప్ షూటింగ్ ను ప్లాన్ చేస్తోంది. నిన్న నైట్ కూడా షూట్ చేశారు. చరణ్ కూడా ఈ సినిమా షూటింగ్ కోసం విశ్రాంతి కూడా తీసుకోకుండా షూట్ లో పాల్గొంటున్నాడు. పది రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్ లో నాలుగు రోజులు తరువాత ఎన్టీఆర్ కూడా జాయిన్ కానున్నాడు.

ఇక ఈ సినిమా షూటింగ్ కి వచ్చే ముందు చరణ్ తన మీసాలు, హెయిర్ స్టైల్ ని తన పాత్రకు తగ్గట్లు పూర్తిగా మార్చుకున్నాడు. అయితే చరణ్ ఫోటోని హెయిర్ స్టైలిస్ట్ హకీమ్ అలీమ్ తన ఇన్ స్టాగ్రామ్ వేదికపై షేర్ చేశాడు. ఈ ఫోటో వేల లైకులు అందుకొంది. పైగా రామ్ చరణ్ లుక్ ని తమ డీపీలకు తగిలించుకుని మురిసిపోతున్నారు మెగా అభిమానులు.

అన్నట్టు ‘ఆర్ఆర్ఆర్’ సినిమా షూటింగ్ కోసం చరణ్ మరో పదిరోజులు డేట్లు ఇచ్చాడు. ఆ తరువాత వెంటనే ‘ఆచార్య’ షూటింగ్ ను పూర్తి చేయనున్నాడు. అయితే ఆ తరువాత చరణ్ చేయబోయే సినిమా పై ఇంకా క్లారిటీ రాలేదు. డైరెక్టర్ శంకర్ తో సినిమా సెట్ చేసుకోవడానికి చాలా సిట్టింగ్స్ కూర్చోని సినిమాని ఫైనల్ చేసుకున్నాడు ‘మెగా పవర్ స్టార్’.

కాకపోతే ఇప్పుడు దర్శకుడు శంకర్, ‘ఇండియన్ 2’ లీగల్ సమస్యల నుంచి సులువుగా బయట పడతాడనే నమ్మకం లేదు. అప్పుడు ఇప్పట్లో శంకర్ చరణ్ తో సినిమా చేయలేడు. ‘ఆర్ఆర్ఆర్’ తరువాత వచ్చే పాన్ ఇండియా ఇమేజ్ ను కాపాడుకోవాలి అంటే, చరణ్ అర్జెంట్ గా మరో పాన్ ఇండియా డైరెక్టర్ ను సెట్ చేసుకోవాలి. అందుకే, చెర్రీ కూడా ఆ ప్రయత్నాలు చేసే ఆలోచనలో ఉన్నాడట.

Back to top button