టాలీవుడ్సినిమా

రికార్డుల ‘మగధీర’కు 11 ఏళ్లు


రెండు జాతీయ అవార్డులు, ఏడు ఫిల్మ్ ఫేర్ అవార్డులు, తొమ్మిది నంది పురస్కారాలు… వంద కోట్ల కలెక్షన్స్‌.. మరెన్నో రికార్డులు.. ఇదీ స్టార్ డైరెక్టర్ ఎస్‌ఎస్‌ రాజమౌళి, రామ్‌ చరణ్‌ కాంబినేషన్‌లో వచ్చిన సూపర్ హిట్‌ మూవీ ‘మగధీర’ ట్రాక్‌ రికార్డు. ఈ చిత్రం విడుదలై ఈ రోజు (శుక్రవారం)తో 11 ఏళ్లు పూర్తయింది. 2009లో జులై 31వ తేదీని విడుదలైన ఈ యాక్షన్‌, రొమాంటిక్‌ డ్రామా ఎంత పెద్ద హిట్‌ అయిందో అందరికీ తెలిసిందే. మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్‌కు ఇది రెండో చిత్రమే. అయినా అతను ఎంతో పరిణతితో నటించాడు. హర్ష పాత్రలో అల్లరి ప్రేమికుడిగా. కాలభైరవ పాత్రలో పోరాట యోధుడిగా మెప్పించాడు. తన డ్యాన్స్, ఫైట్స్‌తో ఆల్‌రౌండ్‌ షో చేశాడు. అంతకుముందే పలు చిత్రాల్లో నటించిన హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌కు మగధీర బ్రేక్‌ ఇచ్చింది. తెరపై చెర్రీ, కాజల్‌ కెమిస్ట్రీ బాగా కుదిరింది. ఈ మూవీ తర్వాత ఇద్దరికీ స్టార్డమ్‌ వచ్చింది.

Also Read: మహేష్‌… ఆ వైబ్రేషన్స్‌ మొదలై 21 ఏళ్లు

తనకు ఏడో చిత్రమైన ఈ మూవీని రాజమౌళి ఎప్పట్లాగే ప్యాషనేట్‌గా తీశాడు. పునర్జన్మల నేపథ్యంలో తండ్రి విజయేంద్ర వర్మ ఇచ్చిన అద్భుతమైన స్టోరీని అంతకంటే అద్బుతంగా తెరకెక్కించాడు రాజమౌళి. దాంతో, అప్పటిదాకా ఉన్న తెలుగు ఫిల్మ్‌ బాక్సాఫీస్‌ రికార్డులను బద్దలు కొట్టిన మగధీర సరికొత్త బెంచ్‌ మార్క్‌ క్రియేట్‌ చేసింది. రాజమౌళి తీస్తున్నది కావడంతో రిలీజ్‌ ముందే ఈ మూవీకి భారీ హైప్‌ ఏర్పడింది. విడుదయ్యాక రాజమౌళి పేరు మార్మొగింది. సినిమా పాటలు కూడా సూపర్ హిట్‌ అయ్యాయి. ఎంఎమ్ కీరవాణి సంగీతం, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోరు సినిమాకు మరింత ప్లస్‌ అయింది. బంగారు కోడిపెట్ట రీమేక్‌తో పాటు పంచదార బొమ్మ, ధీర ధీర పాటలైతే చాన్నాళ్లు ట్రెండింగ్‌లో ఉన్నాయి. బంగారు కోడిపెట్ట సాంగ్‌లో చిరంజీవి గెస్ట్‌ అప్పియరెన్స్‌ ఇచ్చాడు. ఇక, ఈ మూవీలో దేవ్‌ గిల్‌ చేసిన విలన్‌ పాత్ర, దివంగత శ్రీహరి చేసిన షేర్ ఖాన్‌ పాత్రలు కూడా హైటైల్‌ అయ్యాయి. సెంథిల్‌ కుమార్ సినిమాటోగ్రఫీ, పీటర్హెయిన్స్‌ స్టంట్స్‌ ముఖ్యంగా వంద మందిని చంపే యుద్ధం, గుర్రపు స్వారీ సీక్వెన్స్‌లు ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చేశాయి. ఇలా అన్నీ పర్ఫెక్ట్‌గా కుదరడంతో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్‌, బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ 35 కోట్లతో మగధీర తీస్తే ఏకంగా 100 కోట్ల రాబట్టింది.

Also Read: స్టైలిష్‌ స్టార్+ సక్సెస్‌ఫుల్‌‌ డైరెక్టర్.. క్రేజీ కాంబో

ఇంతటి ఘన విజయం సాధించి తన కెరీర్ను మలుపు తిప్పిన మగధీర రిలీజై 11 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని హీరో రామ్‌ చరణ్‌ గుర్తు చేసుకున్నాడు. ‘ఇది నా కెరీర్లో మధురమైన జ్ఞాపకం. నన్ను చాలా మార్చిన, నాలోని ప్రతి ప్రతిభకు పరీక్ష పెట్టిన సినిమా ఇది. మగధీర చిత్ర బృందం, ఆడియన్స్‌ చూపించిన ప్రేమానురాగాలకు నేను విధేయుడై ఉంటాను. రాజమౌళి గారు.. మీరు నా సామర్థ్యానికి మించి పని చేసేలా ప్రోత్సహించారు. ఆ కష్టానికి తగిన ప్రతిఫలం వస్తుందని చెప్పారు’ అని ట్వీట్‌ చేశాడు. ఆ మూవీలో పలు వర్కింగ్ స్టిల్స్‌తో పాటు పోస్టర్లతో రూపొందించిన ఓ స్పెషల్‌ వీడియోను కూడా పోస్ట్‌ చేశాడు. కీరవాణి, సెంథిల్‌కుమార్ తదితరులు కూడా మగధీరను గుర్తు చేసుకున్నారు.

https://twitter.com/AlwaysRamCharan/status/1289092827985539078

Tags
Show More
Back to top button
Close
Close