టాలీవుడ్సినిమాసినిమా వార్తలు

విజయేంద్ర ప్రసాద్ గడ్డంపై వర్మ కామెంట్లు

RGV, Vijayendra Prasadతెలుగు సినీ పరిశ్రమలో రాంగోపాల్ వర్మ అంటే తెలియని వారుండరు. తనదైన శైలిలో చిత్రాల నిర్మాణం చేసిన ఘనత ఆయనకే సొంతం. శివ చిత్రంతో సినిమా పరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న ఆయన ప్రస్తుతం రూటు మార్చుకున్నట్లు తెలుస్తోంది. సంచలన చిత్రాల నిర్మాణంలో ఆయన శైలి భిన్నమైనదే. పరిశ్రమలో తనకంటూ ఓ ముద్ర వేసుకున్నారు. అది రొమాన్స్, థ్రిల్, క్రైం లాంటి కథాంశాలతో తన చిత్రాలు విభిన్నంగా ఉండాలని భావిస్తుంటారు. కానీ కొద్ది రోజులుగా ఆయన పసందైన చిత్రాల నిర్మాణం చేయడం లేదని ఓ టాక్ వస్తోంది. ఆయన చిత్రాల్లో వాడి తగ్గిపోయిదనే ఆరోపణలు వస్తున్నాయి. ఒకప్పుడు ఏ సినిమా తీసినా హిట్ కొట్టే వర్మ ప్రస్తుతం ఆ టాక్ కనిపించడం లేదు.

ఆయన ట్రాక్ పై ఇప్పటికే పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పటి వర్మకు ఇప్పటి ఆయనకు పోలికే లేదని చెబుతున్నారు. శివ, రంగీలా, క్షణక్షణం, సత్య, కంపెనీ, సర్కార్ లాంటి చిత్రాల నిర్మాణంతో ఆయనలోని శక్తి ఏమిటో తెలుస్తోంది. కానీ కొంత కాలంగా అభిమానులను సైతం ఆశ్చర్యపరుస్తున్నారు. ఇండియాలో టాప్ వన్ డైరెక్టర్లలో ఒకరైన వర్మ తనదైన ముద్ర వేయడం లేదు. చిత్రాల నిర్మాణంలో పస కనిపించడం లేదు. దీంతో అభిమానులు నిరాశ చెందుతున్నారు.

ఇటీవల కనబడుట లేదు చిత్రం సమీక్షకు హాజరైన రాంగోపాల్ వర్మ, రచయిత విజయేంద్ర ప్రసాద్ ఒకే వేదికపై ఉన్నారు. దీంతో విజయేంద్ర ప్రసాద్ వర్మపై ఆకస్తికర కామెంట్లు చేశారు. సినిమా నిర్మాణంపై శ్రద్ధతోనే వర్మ పరిశ్రమలోకి అడుగుపెట్టి అనతికాలంలోనే ఎంతో పేరు తెచ్చుకున్నారని చెప్పారు. అలాంటి దర్శకుడు ప్రస్తుతం తన ట్రెండ్ మార్చి చిత్రాలు తీయడంతో అభిమానుల్లో నైరాశ్యం కనిపిస్తోందన్నారు.

రంగీలా లాంటి చిత్రం తీయడంతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు వర్మ అన్నారు. ఆయన తీసిన సినిమాలతో ప్రేరణ పొందిన అనేక మంది దర్శకులుగా మారారన్నారు. శ్రీదేవిని ఆయన చూపించినంత గ్లామర్ గా ఎవరు చూపించలేదన్నారు. ఆమెతో జాము రాతిరి జాబిలమ్మ పాట పాడించి ఆమెలో గాయని ఉందని గుర్తించిన గొప్ప దర్శకుడు అన్నారు. అప్పటి వర్మను చూడాలని ఉందని వ్యాఖ్యానించారు.

దీనికి రాంగోపాల్ వర్మ నవ్వుతూ విజయేంద్ర ప్రసాద్ గడ్డం గురించి మాత్రమే మాట్లాడారు. ఆయన గడ్డం ఎందుకు పెంచుతున్నారని అడిగారు. ప్రధాని మోడీని చూశా. లేక రవీంద్రనాథ్ ఠాగూర్ ను చూసి పెంచుతున్నారో తెలియడం లేదని పేర్కొన్నారు. లేక తన కొడుకు రాజమౌళి అంత గడ్డం పెంచితే నేను పెంచలేనా అనే ఉద్దేశంతో పెంచుతున్నారా అని వ్యాఖ్యానించారు. రామాయణం రాసిన వాల్మీకి కంటే గొప్పదైన బాహుబలి కథ రాసినందుకు ఆయనను మించి గడ్డం పెంచాలన్న ఉద్దేశంతో పెంచుతున్నారా అని సరదాగా చెప్పుకొచ్చారు.

Back to top button