పండుగ వైభవంప్రత్యేకంవైరల్

ఆ గ్రామంలో వింత ఆచారం.. గొర్రెకు, పొట్టేలుకు వైభవంగా పెళ్లి..!

 

సాధారణంగా కొన్ని గ్రామాలు ప్రత్యేక ఆచారాలను పాటిస్తూ ఉంటాయి. వేరే ప్రాంతాల ప్రజలకు ఆ ఆచారాలు వింతగా అనిపించినా కొన్ని గ్రామాల ప్రజలు ఆ ఆచారాలను పాటిస్తూ ఉంటారు. సాధారణంగా వర్షాలు కురవని పక్షంలో కప్పలకు పెళ్లి చేయడం గురించి మనం గతంలో వినే ఉంటాం. అయితే ఒక గ్రామంలో మాత్రం గొర్రెకు, పొట్టేలుకు వైభవంగా పెళ్లి జరిపించారు. ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ తరువాత ఆ గ్రామంలో ఈ విధంగా గొర్రెకు, పొట్టేలుకు పెళ్లి జరిపిస్తారు.

Also Read: ఏలూరులో మళ్లీ వచ్చిన వింత వ్యాధి.. బాధితుల సంఖ్య ఎంతంటే..?

ఏపీలో చిత్తూరు జిల్లా కేవీపల్లె మండలం కురువపల్లె గ్రామ ప్రజలు ఈ ఆచారాన్ని ఫాలో అవుతున్నారు. భోగి, సంక్రాంతి, కనుమ వేడుకలు ముగిసిన తరువాత రెండో రోజున ఈ గ్రామంలో గొర్రెకు, పొట్టేలుకు పెళ్లి జరిపిస్తారు. ఈ విధంగా పెళ్లి చేయడం ద్వారా గ్రామం సుభిక్షంగా ఉంటుందని గ్రామ ప్రజలు భావిస్తారు. ఈ విధంగా పెళ్లి చేయడం ద్వారా గ్రామానికి మంచి జరుగుతుందని కురువపల్లె గ్రామ ప్రజలు విశ్వసిస్తారు.

Also Read: అంత్యక్రియలలో కుండలో నీరు పోసి రంధ్రాలు పెట్టి ఎందుకు పగలగొడతారో తెలుసా..?

గొర్రెకు, పొట్టేలుకు ఘనంగా వివాహం చేయడం వల్ల గౌరమ్మ గ్రామ ప్రజలన కాపాడుతుందని.. గొర్రెలు ఎటువంటి వ్యాధుల బారిన పడవని.. గ్రామంలోని పంట పొలాలను చీడపీడలు వేధించవని గ్రామం సుభిక్షంగా ఉంటుందని గ్రామ ప్రజలు వెల్లడిస్తున్నారు. గ్రామస్తులు మొదట దొడ్డి గంగమ్మకు పూజలను నిర్వహించి ఆ తరువాత గొర్రె, పొట్టేలులను అలంకరించి పెళ్లి వేడుక జరుపుతారు.

మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం

గ్రామంలోని రెండు కుటుంబాలకు చెందిన సభ్యులు వివాహ వేడుకను నిర్వహించారు. ఈ పెళ్లి వేడుకకు గ్రామ ప్రజలతో పాటు ఇతర గ్రామాల ప్రజలు సైతం హాజరయ్యారు. సెల్ ఫోన్ లో పెళ్లికి హాజరైన వాళ్లు వివాహ వేడుకను వీడియో తీశారు. గొర్రె, పొట్టేలుకు పెళ్లి వేడుక జరిపిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Back to top button