క్రిస్మస్ వార్తా విశేషాలుక్రిస్మస్ స్పెషల్

మెగా క్రిస్మస్ వేడుకల్లో రాంచరణ్.. కొత్త జంటే హైలెట్..!

క్రిస్మస్ పార్టీలో రాంచరణ్ తో కలిసి సందడి చేసిన నిహారిక-చైతన్య.

ramcharnడిసెంబర్ 25న ఏసుక్రీస్తు జన్మదినం. ప్రతీయేటా ఈరోజున క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది కరోనా మహమ్మరి ఉన్నప్పటీకీ క్రిస్మస్ వేడుకలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి.

కరోనా మహమ్మరి ప్రభావంతో యూరప్ దేశాల్లో క్రిస్మస్ వేడుకలు రద్దయ్యాయి. దీంతో వారంతా కుటుంబంతో క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్నారు. భారత్ లోనూ కరోనా నిబంధనలు పాటిస్తూ క్రిస్మస్ సంబరాలు నిన్నటి నుంచే మొదలయ్యాయి.

క్రిస్మస్ పండుగ సందర్భంగా మెగా ఫ్యామిలీ అంతా ఒక్కచోట చేరి పార్టీ చేసుకున్నారు. ఈ వేడుకల్లో మెగా పవర్ స్టార్ రాంచరణ్.. కొత్త జంట చైతన్య.. నిహారికలు హెలైట్ గా నిలిచారు.

రాంచరణ్.. నిహారిక.. చైతన్య.. వరుణ్ తేజ్ లు క్రిస్మస్ వేడుకల్లో సందడి చేసిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలను రాంచరణ్ తన ట్వీటర్లో పోస్టు చేసి అభిమానులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.

ఇక ఇదే వేడుకల్లో మెగా ఫ్యామిలీ చెందిన హీరోలంతా పాల్గొన్నారు. స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ అల్లు అర్జున్.. సాయిధరమ్ తేజ్.. కల్యాణ్ దేవ్.. స్నేహా రెడ్డి.. ఉపాసన.. శిరీష్.. సుస్మిత‌.. శ్రీజ‌.. త‌దిత‌రులు క్రిస్మస్ వేడుకల్లో సందడి చేశారు.

Back to top button