సినిమాసినిమా వార్తలు

Ram Gopal Varma: తాలిబన్లపై రాంగోపాల్ వర్మ వీడియో.. వైరల్

తాలిబన్ల ప్రవర్తనను తప్పుపడుతూ రాంగోపాల్ వర్మ షేర్ చేసిన వీడియో అందరినీ ఆకర్షించింది. ‘చేతిలో ఆయుధాలు పట్టుకొని అప్ఘనిస్తాన్ అధ్యక్ష భవనంలో జల్సాలు చేస్తున్న తాలిబన్లకు సంబంధించిన వీడియోను’ వర్మ షేర్ చేశాడు.

దేశంలో విదేశంలో ఏ సంఘటన జరిగినా దానిపై స్పందిస్తూ వివాదాన్ని రాజేసే వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా అప్ఘనిస్తాన్ లో జరుగుతున్న తాలిబన్ల దురాగతాలపై తనదైన శైలిలో స్పందించారు. తాలిబన్ల తీరుకు సంబంధించి ఒక వీడియోను పోస్టు చేశారు. అదిప్పుడు వైరల్ గా మారింది.

తాలిబన్ల ప్రవర్తనను తప్పుపడుతూ వర్మ షేర్ చేసిన వీడియో అందరినీ ఆకర్షించింది. ‘చేతిలో ఆయుధాలు పట్టుకొని అప్ఘనిస్తాన్ అధ్యక్ష భవనంలో జల్సాలు చేస్తున్న తాలిబన్లకు సంబంధించిన వీడియోను’ వర్మ షేర్ చేశాడు. వాళ్లు ఎలాంటి జంతువులనేది ఇది చూస్తేనే అర్థమవుతోందని ట్వీట్ చేశారు. దీనికి కొనసాగింపుగా మరో ట్వీట్ సైతం చేశాడు.

కాబూల్ లోని ఎమ్యూజ్ మెంట్ పార్కులో తాలిబన్లు గన్స్ చేత పట్టుకొని పిల్లలు ఆడుకునే కార్లలో తిరుగుతూ రైడింగ్ చేస్తూ కేరింతలు కొడుతున్న తాలిబన్ల వీడియోను షేర్ చేశారు. ‘ఇది నిజం.. తాలీబన్స్ జస్ట్ కిడ్స్’ అంటూ ఆర్జీవీ ఎద్దేవా చేశారు.

ప్రస్తుతం ఆర్జీవీ చేసిన ట్వీట్స్ తెగ వైరల్ అవుతున్నాయి. అక్కడ తాలిబన్లు ఎలా వ్యవహరిస్తున్నారన్నది కళ్లకు కట్టేలా వర్మ సెటైర్లు వేశారు. తాలిబన్లు ఒక పిచ్చిపట్టిన మృగాళ్ల ప్రవర్తిస్తున్నారని.. తమకు ఏది తోస్తే అది చేస్తున్నారని.. మొత్తం నాశనం చేస్తున్నారని వర్మ ట్వీట్లను బట్టి అర్థమవుతోంది.

Back to top button