వైరల్సినిమా

దిగ్గజ అగ్ర హీరో కొడుకుపై రేప్ కేసు

Rape case against actor Mithun Chakraborty's son

అతడో ప్లే బాయ్.. సినిమా అవకాశాల కోసం వచ్చే హీరోయిన్లను పటాయించడం.. అవకాశాల పేరుతో వారితో ఎంజాయ్ చేయడం.. అనంతరం వదిలించుకోవడం అలవాటని బాలీవుడ్ లో ఓ వర్గం కోడై కూస్తుంది. ఆయన తండ్రి ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీని ఏలుడు. అగ్రహీరో. కానీ కొడుకు మాత్రం సినిమాల్లో ఫ్లాప్ అయ్యి ఇప్పుడు ఈ దుకాణం పెట్టాడన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Also Read: స్కామ్-1992: ఇండియాలో టాప్ వెబ్ సిరీస్.. ప్రత్యేకతేంటీ?

బాలీవుడ్ సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తి కుమారుడు మహాక్షయ చక్రవర్తి పై రేప్ కేసు నమోదు కావడం సంచలనమైంది.. గతంలో కూడా మహాక్షయపై ఇలాంటి ఆరోపణలే కొందరు వర్ధమాన నటీమణులు చేశారు. రెండేళ్ల క్రితం భోజ్ పురి నటిని పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి రేప్ చేశాడని..గర్భస్రావం కూడా చేయించినట్లు మహాక్షయపై ఆరోపణలు వచ్చాయి. తాజా మరో యువతి అతడిపై పోలీస్ స్టేషన్ గడప తొక్కడం కలకలం రేపింది.

తాజాగా ముంబైకి చెందిన ఓ యువతి ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనతో శారీరక సంబంధం పెట్టుకున్నాడని.. చివరకు మోసం చేశాడని మహాక్షయపై ముంబైలోని ఓషివారా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. మహాక్షయ తనతో నాలుగేళ్ల పాటు సహజీవనం చేశాడని.. అనంతరం పెళ్లి మాట ఎత్తితే తనను మానసికంగా శారీరకంగా అనేక ఇబ్బందులకు గురిచేశాడని ఆమె ఆరోపించారు.

Also Read: ‘రాధేశ్యామ్’ టీమ్ పై మండిపడుతున్న ప్రభాస్ ఫ్యాన్స్..!

ఇక తాను గర్భం దాల్చడంతో బలవంతంగా తనకు అబార్షన్ చేయించారని.. కేసు పెడితే చర్యలు తీవ్రంగా ఉంటాయని మహాక్షయ తల్లి యోగితా బాలి కూడా తనను బెదిరించారని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

Back to top button