అత్యంత ప్రజాదరణసినిమా వార్తలు

‘పవర్ స్టార్’ పుణ్యమా అని మళ్ళీ ట్రెండ్ మారింది !

Rashi Kanna
‘పవర్ స్టార్ పవన్ కళ్యాణ్’ వకీల్ సాబ్ పుణ్యమా అని మళ్ళీ లాయర్ పాత్రలు ట్రెండ్ లోకి వచ్చాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో లాయర్ పాత్రలకి క్రేజ్ పెరిగింది. అయితే హీరోయిన్లు కూడా నల్ల కోటు ధరించి కోర్టులో వాదిస్తూ మొత్తానికి సినిమాకి అదనపు బలం అవుతున్నారు. ‘వకీల్ సాబ్’లో పవన్ లాయర్ గా అదరగొడుతుంటే… ‘లాయర్’ పాత్రల్లో హీరోయిన్లు కూడా అదరగొడుతున్నారు. అలాగే రాబోతున్న మరో సినిమాలో కూడా మరో క్రేజీ హీరోయిన్ లాయర్ గా కనిపించబోతుంది. ఐతే, ఈ ఏడాది ఇప్పటివరకు మూడు సినిమాల్లో ముగ్గురు హీరోయిన్లు లాయర్ పాత్రల్లో కనిపించడం విశేషం.

ఇది యాదృచ్చికంగా జరిగినా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. అల్లరి నరేష్ హీరోగా నటించిన ‘నాంది’ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ సిన్సియర్ న్యాయవాదిగా చాల బాగా ఆకట్టుకుంది. వరలక్ష్మి సీరియస్ యాక్టింగ్ వల్ల కూడా సినిమాకి పేరొచ్చింది. ఇక రీసెంట్ గా సూపర్ డూపర్ హిట్టయిన ‘జాతిరత్నాలు’ సినిమాలో కొత్త భామ ‘ఫరియా అబ్దుల్లా’ లాయర్ పాత్ర ధరించి.. మొత్తానికి ప్రేక్షకులను ఫుల్ గా నవ్వించ్చింది. అన్నట్టు ఆమె సినిమాలో లాయర్ కాదు, లా స్టూడెంట్.. అయినా నల్లకోటు వేసుకొని జడ్జి బ్రహ్మానందంకే షాక్ ఇచ్చి కామెడీని రెట్టింపు చేసింది.

అలాగే, మరో క్రేజీ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఈ ఏడాది లాయర్ గా కనిపించి ఆకట్టుకుంది. ‘చెక్’ సినిమాలో అమెది సీరియస్ లాయర్ పాత్ర. అయితే ఈ సినిమా దారుణంగా పరాజయం పాలైంది అనుకోండి. కానీ రకుల్ కి మాత్రం లాయర్ గా మంచి పేరు వచ్చింది. కాగా ఇప్పుడు లేటెస్ట్ గా మరో బబ్లి బ్యూటి లాయర్ గా అలరించనుంది. ఇంతకీ ఎవరు ఆ హీరోయిన్ అంటే ‘రాశి ఖన్నా’. గోపీచంద్ హీరోగా దర్శకుడు మారుతి తీస్తున్న ‘పక్కా కమర్షియల్’లో రాశి ఖన్నా లాయర్ గా కనిపించనుంది. మొత్తానికి ‘పవర్ స్టార్’ పుణ్యమా అని మళ్ళీ ట్రెండ్ మారింది.

Back to top button