వైరల్సినిమాసినిమా వార్తలు

వైరల్: వాళ్ల ఇంటి కోడలవుతానంటున్న రష్మిక

Rashmika wants to go to a Tamil house as a cousin

Rashmika

విజయ్ దేవరకొండతో వరుసగా సినిమాలు చేస్తూ అతడితో కలిసి ఇటీవల ముంబైలో చెట్టాపట్టాలేసుకొని తిరిగిన హాట్ బ్యూటీ రష్మిక మందన్నా.. తెలుగులో ‘గీతా గోవిందం’, ‘సరిలేరు నీకెవ్వరు’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలతో టాప్ హీరోయిన్ గా ఎదిగింది. ఇప్పుడు సుకుమార్-బన్నీ కాంబినేషన్ లో ‘పుష్ప’లో నటిస్తోంది.

అంతేకాదు.. బాలీవుడ్, కోలీవుడ్ లోనూ రష్మికకు అవకాశం వచ్చింది. కోలీవుడ్ లో ‘సుల్తాన్’ మూవీలో కార్తి పక్కన నటించింది. అయితే ఈ కన్నడ హీరోయిన్ ఇప్పుడు తెలుగులో అంత పెద్ద స్టార్ గా ఉన్నా కూడా తాను తమిళ ఇంటికోడలుగా వెళ్లేందుకు ఇష్టం అని బాంబు పేల్చింది. తెలుగులో విజయ్ తో ఎఫైర్ ఉందని గాసిప్పులు వచ్చాయి… కన్నడలో గతంలో కన్నడ హీరో రక్షిత్ శెట్టితో పెళ్లిని క్యాన్సిల్ చేసుకుంది. ఇప్పుడు ఈ రెండు భాషల్లో కాకుండా తమిళుల కోడలుగా వెళ్లడమే తనకు ఇష్టం అని రష్మిక హాట్ కామెంట్ చేసింది.

‘నాకు తమిళుల సంస్కృతి, సంప్రదాయం, అంటే చాలా ఇష్టం. అక్కడి భోజనం, ఆహార పదార్థాలు చాలా రుచికరంగా ఉంటాయి. ఎప్పటికైనా తమిళవాసుల ఇంటి కోడలిని కావాలన్నదే నా కోరిక’ అని అందగత్తె తెలుగు, కన్నడ వాసులకు తనను చేసుకునే చాన్స్ లేదని చెప్పకనే చెప్పింది.

మరి ఈ ప్రకటన విన్నాక కన్నడిగులు, తెలుగువాళ్లు, ముఖ్యంగా విజయ్ దేవరకొండ ఎలా స్పందిస్తాడో అని సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు.

Back to top button