సినిమాసినిమా వార్తలు

బన్నీని ఆ కోరిక కోరిన రష్మిక

Rashmika who made a wish to Allu Arjun

సౌత్ ఇండియాలోనే ఫుల్ క్రేజ్ ఉన్న హీరోయిన్ గా రష్మిక మందన్నా ఎదిగిపోయింది. వరుస హిట్స్ తో స్టార్ హీరోలతో నటిస్తూ రెండు చేతులా సంపాదిస్తోంది. క్రేజ్ తోపాటు పారితోషికాన్ని అమాంతం పెంచేసింది. గీతాగోవిందం, సరిలేరు నీకెవ్వరు మూవీలతో బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చి ఇప్పుడు పుష్ప సినిమాతో మరో హిట్ అందుకోవడానికి రెడీ అయ్యింది.

తాజాగా సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా చేస్తున్న ‘పుష్ప’లో రష్మిక హీరోయిన్ గా చేస్తోంది. ఏప్రిల్ 5న రష్మిక పుట్టిన రోజు సందర్భంగా అల్లు అర్జున్ ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు.

అల్లు అర్జున్ ట్వీట్ చేస్తూ ‘ఈ సంవత్సరం మరెన్నో విజయాలు పొందాలని.. నువ్వు కోరుకున్నవన్నీ నెరవేరాలని కోరుతూ బర్త్ డే విషెస్’ అంటూ శుభాకాంక్షలు తెలిపాడు.

దీనిపై స్పందించిన రష్మిక మందన్నా ‘తనకు బర్త్ డే గిఫ్ట్ కావాలని.. సెట్లో కేక్ కట్ చేయించే వరకు ఊరుకోనని..’ ఫన్నీగా కామెంట్ చేసింది. దీంతో తప్పకుండా త్వరలోనే సెట్లో కలుద్దాం అంటూ అల్లు అర్జున్ బదులిచ్చాడు.

ఈ ఇద్దరి ట్వీట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Back to top button