మిర్చి మసాలా

డీలర్లకు తలనొప్పిగా మారిన రేషన్ పోర్టబిలిటీ!

దేశ వ్యాప్తంగా 21 రోజుల లాక్ డౌన్ నేపథ్యంలో ఇంటి దగ్గరే ఉండే పేద ప్రజలకు రేషన్ బియ్యం ఇవ్వడానికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రణాళికలు రచించారు. ఇందులో భాగంగా రేషన్ షాపుల ద్వారా ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేసే బియ్యం చేస్తున్నారు. అయితే రేషన్‌ కోసం లబ్ధిదారులు ఎగబడటం, కనీసం మాస్క్‌ లు కూడా ధరించకపోవడంతో రేషన్ షాప్ డీలర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

దీనికి తోడు లబ్ధిదారులకు రేషన్‌ పోర్టబిలిటీ అవకాశం ఉండటంతో ఈ ముప్పు మరింత పెరిగింది. వివిధ జిల్లాలకు చెందినవారు సమీప నగరాలలో నివాసం ఉండటంతో ఆయా నగరాలలో పోర్టబిలిటీ ద్వారా రేషన్‌ తీసుకునే వెసులుబాటు ఉంది. కానీ ఈ–పాస్‌ డాటాలో సాంకేతిక సమస్యల కారణంగా పోర్టబిలిటీలో బయోమెట్రిక్‌ గుర్తింపు సమస్యగా తయారైంది. దీంతో లబ్ధిదారులకు నిరాశ తప్పడం లేదు. జిల్లా, రాష్ట్ర స్థాయి పోర్టబిలిటీ తీరు ఇలా ఉంటే జాతీయ పోర్టబిలిటీ అంటే ఒక రాష్ట్రం వారు మరో రాష్టంలో ఉండి రేషన్ తీసుకోవాలంటే పోర్టబిలిటీ వ్యవస్థ అసలుకే పనిచేయడం లేదు.