వైరల్సినిమాసినిమా వార్తలు

రవితేజ షాకింగ్ రెమ్యునరేషన్

Ravi Teja Shocking Remuneration

Raviteja

కరోనా కల్లోలంలోనూ మన హీరోలు పారితోషికాన్ని ఏమాత్రం తగ్గించడం లేదు. పైగా ఇంకా పెంచుతుండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. సినీ కార్మికులు, సిబ్బంది ఉపాధి లేక కొట్టుమిట్టాడుతుంటే మన అగ్రహీరోలు మాత్రం సినిమాలకు తీసుకునే పారితోషికాన్ని పెంచుతుండడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

దేశంలో కరోనా మహమ్మారి తీవ్రత ఇంకా తగ్గలేదు. థియేటర్లు ఇంకా తెరవలేదు. కొత్త సినిమాలు ఎప్పుడు తెరపైకి వస్తాయో ఎవరికీ తెలియదు. కానీ హీరోలు తమ రెమ్యునరేషన్ మాత్రం ఈ కల్లోల పరిస్థితిలో తగ్గించకపోగా పెంచుతున్నారు.

ఈ రోజుల్లో భారీగా పలుకుతున్న నాన్ థియేట్రికల్ హక్కుల కోసం నిర్మాతలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ హీరోలు ఆ ఆనందాన్ని నిర్మాతలకు వదిలిపెట్టడం లేదు. అందులోనూ షేర్లు అడుగుతుండడంతో నిర్మాతలకు ఏమీ మిగలని పరిస్థితి నెలకొంది.

తాజాగా హీరోల రెమ్యూనరేషన్లు చూస్తే వరుణ్ తేజ్ రూ.12 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు గాసిప్స్ వినిపిస్తున్నాయి. రవితేజ ఏకంగా రూ .17 కోట్లు అడుగుతున్నట్లు తాజా వార్తలు వచ్చాయి.

రవితేజ అస్సలు తన సినిమాలు, రెమ్యూనరేషన్ విషయంలో అస్సలు రిలాక్స్ అవ్వడం లేదట.. చాలా ప్రాజెక్టులను బ్యాక్ టు బ్యాక్ చేయడం మొదలుపెట్టి రెమ్యూనరేషన్ బాగా తీసుకుంటున్నట్టు తెలిసింది.

రవితేజకు ఇటీవల ‘క్రాక్‌’సినిమాతో పెద్ద హిట్ అందుకున్నాడు. రమేష్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం దాదాపు సగం పూర్తయ్యింది.తాజాగా మరో కొత్త దర్శకుడి సినిమాను రవితేజ ఓకే చేసాడు. నక్కినా త్రినాథ రావు చిత్రం కూడా వరుసలో ఉంది.

ఈ చిత్రాలకు రెమ్యూనరేషన్ ఇంకా నిర్ణయించబడలేదు. అయితే కొత్త నిర్మాతల నుంచి రూ .17 కోట్లు రవితేజ డిమాండ్ చేస్తున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Back to top button