టాలీవుడ్సినిమా

చిరు ‘చంటబ్బాయి’గా రవితేజ ?


మాస్ మహరాజా రవితేజకి హిట్ లేకపోయినా ప్రస్తుతం వరుస సినిమాలను అంగీకరిస్తూ ముందుకు పోతున్నాడు. ఈ క్రమంలో రచయిత ప్రసన్న కుమార్ బెజవాడ రాసిన కథతో, ‘నేను లోకల్’ ఫేమ్ నక్కిన త్రినాధరావు దర్శకత్వంలో రవితేజ ఓ సినిమా చెయ్యటానికి ఒప్పుకున్నాడు. కరోనా రాకపోయి ఉంటే… ఈ పాటికే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లేది. అయితే ఈ సినిమా గురించి ఒక ఇంట్రస్టింగ్ అప్ డేట్ తెలిసింది. ఈ సినిమా ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ అట, ముఖ్యంగా సినిమాలో రవితేజ క్యారెక్టరైజేషన్ ఫుల్ కామెడీ టైమింగ్ తో అద్భుతంగా ఉంటుందని.. చిరు ‘చంటబ్బాయి’ సినిమాకి ఈ సినిమా సీక్వెల్ గా ఉండబోతుందని తెలుస్తోంది.

హైదరాబాద్ వాసుల్లో.. కరోనా కొత్త లక్షణం..!

ఎలాగూ త్రినాథరావ్ నక్కినకి మంచి కామెడీ డైరెక్టర్ అని పేరు ఉంది. ఆయన గత చిత్రాలు కూడా ‘సినిమా చూపిస్తా మామ’ ‘నేను లోకల్ వంటి కామెడి సినిమాలు మంచి ఎంటెర్టైమెంట్ తో సాగుతూ సూపర్ హిట్ అయ్యాయి. ఈ సినిమా కూడా అలాగే సాగుతుందని.. రవితేజ కామెడీ టైమింగ్ కి తగ్గట్లు సినిమా ఉంటుందట. ఏమైనా కేవలం తన మాడ్యులేషన్ తోనే అద్భుతమైన కామెడీని పండించగలడు రవితేజ.

పార్టీల చేతుల్లో కీలుబొమ్మలు.. కాపు నేతలు మేల్కొనేదెప్పుడు?

నిజానికి కిక్ తరువాత రవితేజ మళ్లీ ఆ రేంజ్ కామెడీ సినిమా చెయ్యలేదనే చెప్పాలి. ఈ సారి రవితేజ ప్రేక్షకులను ఫుల్ గా నవ్వించడం ఖాయంలా కనిపిస్తుంది. పీపుల్స్ మీడియా విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల ఈ సినిమాని నిర్మిస్తున్నారట. అన్నట్టు రవితేజ ప్రస్తుతం క్రాక్ మూవీలో నటిస్తున్నాడు. అలాగే రమేష్ వర్మ డైరక్షన్ లోనూ ఓ సినిమా చేయబోతున్నాడు.