జాతీయంరాజకీయాలు

మోడీపై రాహుల్ నిప్పుల వెనుక అసలు కారణం ఇదీ


కరోనా లాక్ డౌన్ తో అందరి ఉపాధి పోయింది. చాలామంది ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడ్డారు. ప్రజల ఆదాయం పడిపోయింది. ఇప్పుడు దేశమంతా దీన్ని అరికట్టడంపైనే కాచుకు కూర్చుంది. ప్రజలు, ఉద్యోగులంతా ఎప్పుడు కరోనా తగ్గుతుంది.? ఎప్పుడు పనులు చేసుకుందామని ఎదురుచూస్తున్నారు.

అయితే ఇంతటి విపత్కర పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ నాయకులు చాలా సంతోషంగా ఉన్నారట.. లాక్ డౌన్ లో తెగ ఎంజాయ్ చేస్తున్నారట.. దానికి కారణం ఏంటంటే… కాంగ్రెస్ యువ నేత రాహుల్ గాంధీ చాలా యాక్టివ్ కావడమేనట.. రాహుల్ గాంధీ ఇటీవల కాలంలో కరోనాను మొదలుపెడితే చైనాతో ఫైట్.. 20మంది సైనికుల మరణం వరకు ప్రధాని మోడీని ఇరుకున పెడుతూ ఇరగదీస్తుండడంపై చాలా సంతోషంగా ఉన్నారట.. కరోనా లాక్ డౌన్ కు కాంగ్రెస్ నేతలంతా కృతజ్ఞతలు తెలుపుతున్నారట..

చైనాపై మోడీ వ్యూహం ఫలించేనా?

కరోనా లాక్ డౌన్ సమయంలోనే క్రియా రహితంగా ఉన్న రాహుల్ గాంధీ అకస్మాత్తుగా చురుకుగా మారారు. మోడీని లెఫ్ట్ అండ్ రైట్ వాయిస్తూ ఇరుకునపెడుతున్నారు. దీంతో కాంగ్రెస్ తిరిగి వార్తల్లోకి వచ్చింది.

అయితే కాంగ్రెస్ సభ్యులు సంతోషంగా ఉండడానికి మరో కారణం ఉంది. లాక్ డౌన్ కారణంగా ఏ విమానాలు భారతదేశం నుంచి విదేశాలకు వెళ్లడం లేదు. చీటికి మాటికి ధ్యానం.. యోగా సహా ఇతర రిలాక్స్ కావడానికి రాహుల్ గాంధీ దేశం వదిలి విదేశాలకు రహస్య పర్యటనలకు వెళ్లేవారు. ఏ ఏదేశం.. ఎక్కడికి వెళుతున్నాడో ఎవరికీ చెప్పేవాడు కాదు.. రహస్యంగా ఉంచేవాడు.

ప్రభుత్వరంగ బ్యాంకులపై ముప్పేట దాడి

ఇలా రాహుల్ గాంధీ తరచూ అదృశ్యం కావడంపై బీజేపీ విమర్శలకు కాంగ్రెస్ వద్ద సమాధానం ఉండేది కాదట.. దాదాపు 15 రోజుల పాటు రాహుల్ ఆచూకీపై కాంగ్రెస్ నేతలు మల్లగుల్లాలు పడేవారు. ఇప్పుడు విమానాలు రద్దుతో చచ్చినట్టు రాహుల్ దేశంలోనే ఉండి మోడీపై కారాలు మిరియాలు నూరుతున్నారు.

అందుకే ఢిల్లీ కాంగ్రెస్ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. కరోనాను దేవుడే పంపించాడని.. రాహుల్ గాంధీని విదేశీలకు పోనీయకుండా యాక్టివ్ చేశాడని కాంగ్రెస్ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం భారత్ లోనే రాహుల్ ఉండడంతో బీజేపీపై, మోడీపై లాజిక్కులతో విరుచుపడుతూ ఇరుకునపెడుతున్నారు. ఫలితంగా కాంగ్రెస్ అధిష్టానం ఇప్పుడు రాహుల్ తో హ్యాపీగా ఉందట.. రోజూ కాంగ్రెస్ వార్తలతో పండుగ చేసుకుంటోందట..

-ఎన్నం