ఆరోగ్యం/జీవనం

కీళ్ల నొప్పులకు సులువుగా చెక్ పెట్టే ఆహార పదార్థాలివే..?

Foods For Joint Pains

వయస్సు పెరిగే కొద్దీ చాలామందిని కీళ్ల సంబంధిత సమస్యలు వేధిస్తూ ఉంటాయి. కీళ్ల సంబంధిత సమస్యల బారిన పడటానికి వ్యాయామం చేయకపోవడం ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ఎవరైతే తరచుగా వ్యాయామం చేయరో వాళ్లను కీళ్ల సంబంధిత సమస్యలు ఎక్కువగా వేధించే అవకాశాలు ఉంటాయని చెప్పవచ్చు. యుక్త వయస్సులో ఉన్నవాళ్లు వ్యాయామం చేయడం ద్వారా భవిష్యత్తులో కీళ్ల సంబంధిత సమస్యల బారిన పడకుండా రక్షించుకోవచ్చు.

Also Read: నీళ్లలో ఇంగువ పౌడర్ కలిపి తాగితే ఇన్ని ప్రయోజనాలున్నాయా.?

శరీరంలో కాల్షియం తగ్గితే కీళ్ల నొప్పులు ఎక్కువగా వేధిస్తాయి. ఆహారపు అలవాట్లను మార్చుకోవడం ద్వారా కీళ్ల సంబంధిత సమస్యలను అధిగమించవచ్చు. కీళ్ల నొప్పులకు చెక్ పెట్టడానికి మాంసాహారం తినేవాళ్లు చేపలను ఆహారంలో భాగం చేసుకోవాలి. చేపల్లో ఉండే ఒమేగా 3 కొవ్వులు శరీరానికి మేలు చేస్తాయి. చేపలు తినేవాళ్లు సాధారణ చేపలతో పోలిస్తే సాల్మన్ చేపలను తీసుకుంటే మంచిది.

Also Read: ఈ నీళ్లతో కిడ్నీలో రాళ్లకు సులువుగా చెక్.. ఎలా అంటే..?

యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉన్న వెల్లుల్లి కీళ్ల నొప్పులకు చెక్ పెట్టడంలో తోడ్పడుతుంది. అర్థరైటిస్ సమస్యతో బాధ పడేవాళ్లు వెల్లుల్లిని ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా ఈ సమస్యకు సులభంగా చెక్ పెట్టవచ్చు. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభించే పండ్లు కూడా కీళ్ల నొప్పుల సమస్యకు చెక్ పెట్టడంలో తోడ్పడతాయి. శరీరంలోని ఎముకలను ఇవి బలంగా చేయడంలో సహాయపడతాయి.

బాదం, అవిసె గింజలు, వాల్ నట్స్ ను ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా కూడా అనారోగ్య సమస్యలకు సులభంగా చెక్ పెట్టడంతో పాటు కీళ్ల నొప్పులను తగ్గించుకోవచ్చు. ఈ చిట్కాలు పాటించినా కీళ్ల నొప్పులు తగ్గకపోతే వైద్యులను సంప్రదించి చికిత్స చేయించుకుంటే మంచిది

Back to top button