విద్య / ఉద్యోగాలు

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జియో కంపెనీలో ఉద్యోగాలు..?

Reliance JIO Recruitment 2021

ప్రముఖ టెలీకాం కంపెనీలలో ఒకటైన రిలయన్స్ జియో నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం రిలయన్స్ జియో నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. రిలయన్స్ ముంబై కేంద్రంగా బీఈ, బీటెక్ పాసైన వాళ్ల నుంచి జియో దరఖాస్తులను స్వీకరిస్తోంది. 2019, 2020 బ్యాచ్‌లకు సంబంధించిన వారై ఐటి, సీఎస్, ఈసీఈ, ఈఈఈ, టెలికాం బ్రాంచ్‌లలో ఇంజనీరింగ్ పాసైన వాళ్లు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఆసక్తి, అర్హత ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఎవరైతే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటారో వాళ్లు ముందుగా ట్రైనీలుగా శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. జియో ఈ నోటిఫికేషన్ ద్వారా గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ ఉద్యోగ ఖాళీల భర్తీ చేయనుంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వాళ్లు టీమ్ లీడర్ నైపుణ్యం, 2 జీ, 3 జీ, 4 జీ నెట్‌వర్క్ పరిజ్ఞానం, నెట్‌వర్క్ పరిజ్ఞానం, సమాచార నైపుణ్యాలు, విశ్లేషణాత్మక నైపుణ్యాలు, వ్యాపార నైపుణ్యాలను కలిగి ఉండాలి.

ఎవరైతే ఈ ఉద్యోగాలకు ఎంపికవుతారో వారు గ్లోబల్ రోమింగ్ కోసం సాంకేతిక అవసరాలు, డిజైన్లను రూపొందించాల్సి ఉంటుంది. నెట్వర్క్ పనితీరును విశ్లేషించడంతో సమస్యలను పరిష్కరించాల్సి ఉంటుంది. అంతర్జాతీయ నెట్‌వర్క్‌ల రూపకల్పన, ప్రణాళికను రూపొందించాల్సి ఉంటుంది. సేవలు తదితర విషయాలను అనలైజ్ చేయాల్సి ఉంటుంది. కొత్త ఆవిష్కరణలు, నెట్‌వర్క్ విస్తరణ, సాంకేతిక స్థాయి ప్రతిపాదనల తయారీకి రూపకల్పన చేయాల్సి ఉంటుంది.

రిలయన్స్ జియో గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లు సమస్యలను గుర్తించడం, వాటి మెరుగుదల, పరిష్కారం కోసం సిఫార్సులు చేయడం లాంటి విధులను నిర్వహించాల్సి ఉంటుంది.

Back to top button