ఆంధ్రప్రదేశ్రాజకీయాలు

ఏపీలో మత రాజకీయాలు దేనికి సంకేతం..?

Religious politics in AP is a sign of what ..?

ఏ రాష్ట్రంలోనైనా అధికార పార్టీపై ప్రతిపక్షం ప్రతిపక్ష పార్టీపై అధికార పక్షం విమర్శలు చేయడం సహజమే. అయితే విమర్శలకు కూడా ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ దాటితే ప్రజల్లో కూడా ఆ విమర్శలపై వెగటు పుడుతుంది. ప్రస్తుతం ఏపీ రాజకీయాలను చూస్తుంటే ప్రజల్లో ఇదే భావన కలుగుతోంది. అడ్డూఅదుపు లేకుండా ఒక పార్టీపై మరో పార్టీ విమర్శలు చేసుకుంటూ టీడీపీ, వైసీపీ పరువు తీసుకుంటున్నాయి.

Also Read : విపక్షాల సంచలనం.. డిప్యూటీ చైర్మన్ పై అవిశ్వాసం

చౌకబారు విమర్శలతో తమ పార్టీల స్థాయిని ఆ పార్టీలే తగ్గించుకుంటున్నాయి. రాష్ట్రంలోని ఏ చిన్న ఘటన జరిగినా ఆ ఘటనను పెద్దది చేసి చూపడానికి టీడీపీ ప్రయత్నిస్తోంటే వైసీపీ ఆ ఘటనలపై సరిగ్గా స్పందించకుండా విమర్శల పాలవుతోంది. అంతర్వేది రథం ఘటన ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీస్తోంది. ప్రశ్నించడం అవసరమే కానీ టీడీపీ మతాన్ని, కులాలను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయడం సరికాదని తెలుపుతున్నాయి.

రాష్ట్రంలో మత రాజకీయాలు ఏ పార్టీకి మంచివి కావు. రాష్ట్రంలో అధికారంలో ఎప్పుడూ ఒకరి చేతిలోనే ఉండదు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న రాజకీయ పార్టీ ఈ తరహా రాజకీయాలను ప్రోత్సహిస్తే భవిష్యత్తులో ప్రతిపక్షంలో ఉండే పార్టీలు కూడా రాష్ట్రంలో ఏ చిన్న ఘటన జరిగినా ఆ ఘటనకు మతం రంగు, కులం రంగు పులిమే అవకాశం ఉంది. అందువల్ల ఈ తరహా రాజకీయాలకు పార్టీలు దూరంగా ఉంటే మంచిది.

ఇలాంటి ఘటనల్లో ఒక పార్టీపై మరొక పార్టీ విమర్శలు చేసుకోవడం కన్నా అసలు దోషులను గుర్తించి ఇలాంటి ఘటనలకు కారణమవుతున్న వారి విషయంలో కఠినంగా వ్యవహరించాల్సి ఉంది. లేదంటే మాత్రం భవిష్యత్తులో ఈ తరహా రాజకీయాలు పార్టీల ఉనికినే ప్రశ్నార్థకం చేసే అవకాశాలు ఉన్నాయి.

Also Read : ఇష్టమున్నట్టు ఉద్యోగులను తీసేయండి.. మోడీ దారుణ నిర్ణయం?

Back to top button