జనరల్ప్రత్యేకంవ్యాపారము

ఆర్బీఐ కీలక నిర్ణయం.. డిజిటల్ రుణాలపై లోటుపాట్లకు చెక్..?

దేశంలో ఈ మధ్య కాలంలో కొన్ని యాప్ లు రుణాలను ఇస్తూ ఇచ్చిన రుణానికి ఎక్కువ మొత్తంలో వడ్డీలను వసూలు చేస్తున్న సంగతి తెలిసిందే. దేశంలోని కొంతమంది ఈ లోన్ యాప్ ల వల్ల ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. ఈ రుణ యాప్ ల వెనుక ఉన్న చైనాకు చెందిన ప్రధాన సూత్రధారి జై హియాంగ్ ను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేయడంతో పాటు అతని పాస్ పోర్టును స్వాధీనం చేసుకున్నారు.

ఇలా రుణ యాప్ ల వల్ల లోన్ తీసుకున్న వాళ్లు నష్టపోతూ ఉండటంతో ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్బీఐ రుణ యాప్ లలోని లోటుపాట్లను సరిదిద్దేందుకు, అధ్యయనం చేసేందుకు ఒక వర్కింగ్ గ్రూప్ ను ఏర్పాటు చేసింది. ఆర్బీఐ ఒక ప్రకటనలో డిజిటల్ పద్ధతుల ద్వారా అభివృద్ధిని స్వాగతిస్తున్నామని.. అదే సమయంలో వినియోగదారుల భద్రత, విశ్వసనీయత, ప్రైవసీ, డేటా భద్రత అనే అంశాలకు ప్రాధాన్యతను ఇస్తున్నాయని ఆర్బీఐ పేర్కొంది.

అయితే డిజిటల్ రుణాలను ఇస్తున్న యాప్స్ వల్ల అనేక ఇబ్బందులు ఏర్పడుతున్నాయని.. రుణాల లోటు పాట్లను సరిదిద్దేందుకు వర్కింగ్ గ్రూప్ లు పని చేస్తాయని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఆర్బీఐ వర్కింగ్ గ్రూప్ లను ఏర్పాటు చేస్తూ తీసుకున్న నిర్ణయం పట్ల నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రుణాలు ఇచ్చి కంపెనీలు వేధింపులకు పాల్పడుతుంటే ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచనలు చేస్తున్నారు.

కొన్ని రుణ యాప్ లు ఏకంగా 50 శాతం వడ్డీని వసూలు చేస్తున్నాయని సమాచారం. దేశంలో 90 శాతం రుణ యాప్ లను చైనావాళ్లు నడిపిస్తుండగా వేధింపుల వల్ల ఇప్పటివరకు ఆరుగురు చనిపోయారని సమాచారం.

Back to top button