తెలంగాణరాజకీయాలు

రేస్ లో స్పీడ్ పెంచిన రేవంత్?

Revanth Reddy

రేవంత్ రెడ్డి తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని పేరు. ఏ పార్టీలో ఉన్నా, ఫైర్ బ్రాండ్ నేతగా మంచి ఫాలోయింగ్ ఉన్న రేవంత్, గ్రౌండ్ లెవెల్ నుంచి పనిచేస్తూ జడ్పిటిసి గా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ప్రస్తుతం ఎంపీగా కొనసాగుతున్నారు. అనతికాలంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేస్ లో స్పీడ్ పెంచారు. కాంగ్రెస్ పార్టీలో పట్టు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు.

రేవంత్ ఇప్పుడు పిసిసి చీఫ్ రేసులో ఉన్నారు. పిసిసి అధ్యక్ష నియామకం అన్న ప్రతీసారి రేవంత్ కు వద్దని కొందరు, కావాలని ఇంకొందరు ఎవరైనా ఫర్వాలేదని మరికొందరు చెబుతుంటారు. వీరందరి పాలిట్రిక్స్ ను పసిగట్టిన రేవంత్, పార్టీలో తనదైన గ్రూపును బలంగా తయారు చేసుకోవాలని డిసైడ్ అయ్యారట. కాంగ్రెస్ లాంటి జాతీయ పార్టీలో లాబీయింగ్ ముఖ్యమని, తనను సపోర్ట్ చేసే కీలక నేతలను కలుస్తూ మద్దతు కూడగడుతున్నారట. జూబ్లీహిల్స్ లో తన నియోజకవర్గ కార్యాలయం ఓపెనింగ్ నాడే, తనకు మద్దతు పలికే నేతలందర్నీ ఆహ్వానించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందే జిల్లాకు రెండు మూడేసి చొప్పున ఎమ్మెల్యే సీట్లు పట్టుబట్టి ఇప్పించుకున్న రేవంత్, జిల్లాల వారిగా తన పట్టు పెంచుకుంటున్నారట. కొత్తగా వచ్చిన నేతలకు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించొద్దని సీనియర్లు పదేపదే అడ్డుపడుతున్నా, తన పని తాను చేసుకు పోతున్నారట.

ఏడాది కిందటే ఫ్యామిలీతో ఢిల్లీ వెళ్లి, సోనియాను కలిశారు రేవంత్. సోనియాతో దిగిన ఆ ఒక్క ఫోటో వైరల్‌ గా మారడంతో, గాంధీభవన్‌ లో అగ్గిరాజుకుంది. సీనియర్లు వరుసకట్టి ఢిల్లీకెళ్లి రేవంత్‌ కు పీసీసీ రాకుండా అడ్డుకున్నారట. పార్టీ కూడా గ్రీన్ సీగ్నల్ ఇచ్చినట్టే ఇచ్చి వెనక్కి తగ్గింది. ఈ క్రమంలో ఢిల్లీలో రాహుల్ కోటరీకి అత్యంత సన్నిహితుడిగా మారారట. పార్టీ పగ్గాలిస్తే వైఎస్ తరహాలో పార్టీని తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దుతానని మాట కూడా ఇచ్చారట. అయితే, తెలంగాణలో తనను వ్యతిరేకిస్తున్న వారిని కూడా కూల్ చేేసేందుకు, ఇటు నుంచి కూడా నరుక్కొస్తున్నారట రేవంత్.

ఈ క్రమంలో తన పదవికి అడ్డు పడుతున్న వారందర్నీ కలిసాడట. ప్రతీ ఒక్కరూ సహకరించాలని కోరుతున్నారట. రాష్ట్రంలో కాంగ్రెస్ కీలక నేతలుగా చెప్పుకునే షబ్బీర్ అలీ, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి తో సహా అనేకమంది మద్దతు కూడగడుతున్నారట. పార్టీకి ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఒకరిద్దరు తనవైపు పనిచేసేలా ముందు జాగ్రత్త పడుతున్నారట రేవంత్. తెలంగాణలో ఇప్పుడున్న పరిస్థితుల్లో రేవంత్ మినహా మరెవ్వరూ పార్టీని గట్టెక్కించే పరిస్థితిలో లేరనే టాక్ తీసుకొస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది సీనియర్లు అధికార టీఆర్ఎస్‌ తో అంటకాగుతున్న తీరు, కోవర్టు వ్యవహారాలను కాంగ్రెస్ హైకమాండ్ కు చెప్పి సక్సెస్ అయిన రేవంత్ కు, చేతిలో పదవి వచ్చే వరకు గ్యారంటీ లేదనే టాక్ కూడా ఉంది. ఓవైపు గ్రూపు రాజకీయాలకు పెట్టింది పేరైన కాంగ్రెస్‌ లో, అధిష్టానంకు లాయల్ గా ఉండే పాత నేతలకు పెద్దపీట వేస్తారా లేక రేవంత్ వైపు మొగ్గు చూపుతారా అనేది త్వరలోనే తేలిపోతుంది.

Tags
Show More
Back to top button
Close
Close