తెలంగాణప్రత్యేకంరాజకీయాలు

రేవంత్ రెడ్డి టార్గెట్ టీఆర్ఎస్ కాదా..? బీజేపీనా..?

ఘర్ వాపసీ ప్రొగ్రాంపై టీపీసీసీ దృష్టి

Revanth Reddy

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రేవంత్ రెడ్డి దూకుడుగా వెళ్తున్నాడు. ముఖ్యంగా ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి ఇతర పార్టీల్లోకి వెళ్లిన వారికి ఘర్ వాపసీ ప్రొగ్రాం అమలు చేయనున్నాడు. ఇతర పార్టీల్లో అసంతృప్తిగా ఉన్న నేతలను సొంత గూటికి తేవడంతో పార్టీలో బలం పెంచుకోవచ్చని యోచిస్తున్నాడు. ఇందులో భాగంగా వలస నేతలను రేవంత్ రెడ్డి రోజుకొకరిని కలుస్తూ వారిని తీసుకొచ్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అధికార టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ నేతలు ఎలాగూ రారు.. బీజేపీ నుంచి వారిని లాక్కొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ఆయన టార్గెట్ టీఆర్ఎస్ కాకుండా బీజేపీగా మారింది..

తెలంగాణలో పరిస్థితులను భట్టి రాజకీయాలు మారుతున్నాయి. దుబ్బాక ఉప ఎన్నిక వరకు ఏకఛత్రాధిపత్యంతో ఉన్న టీఆర్ఎస్ ఆ ఉప ఎన్నిక తరువాత బీజేపీ ప్రత్యామ్నాయంగా నిలిచినట్లయింది. ఆ తరువాత జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ బీజేపీ బలం పెంచుకోవడంతో ఇక టీఆర్ఎస్ పని అయిపోయిందన్న ప్రచారం జరిగింది. అయితే ఆ తరువాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కారు దూసుకుపోవడంతో బీజేపీ కాస్త వెనుకబడినట్లయింది. ఇదే తరుణంలో మాజీ మంత్రి ఈటలను పార్టీలోకి చేర్చుకోవడంతో మరోసారి బీజేపీ ప్రతపాన్ని చూపించాలని రాష్ట్ర నాయకత్వం ఆ దిశగా ముందుకు వెళ్తోంది.

ఇంతలో టీపీపీసీ అధ్యక్షుడికగా రేవంత్ రెడ్డి నియామకం కావడంతో పరిస్థితులు మారిపోయాయి. అయన పదవీ బాధ్యతలు చేపట్టిన క్షణం నుంచే రాజకీయ దూకుడు ప్రారంభించారు. ఆయన నిర్ణయించుకున్న ప్రకారం కాంగ్రెస్ పార్టీ నుంచి ఇతర పార్టీలోకి వెళ్లిన వారిని తిరిగి తీసుకొచ్చే ప్రయత్నాలు ప్రారంభించారు. అంతకుముందు పార్టీలో ఉన్న అసంతృప్తిని తగ్గించేందకు సీనియర్ నాయకులను మచ్చిక చేసుకున్న రేవంత్ నెక్ట్స్ స్టెప్ ఇతర పార్టీ నాయకులను కాంగ్రెస్లోకి చేర్చుకోవడమే అన్నట్లుగా ముందుకు వెళ్తున్నారు.

అయితే ఆయన కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లోకి వెళ్లిన వారు ప్రస్తుతం వచ్చే పరిస్థితి కనిపించడ లేదు. ఎందుకంటే అధికార హోదాను విడిచి ఎవరూ రారు. దీంతో ఆయన బీజేపీని టార్గెట్ చేశారు. కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వెళ్లిన బోడ జనార్దన్, చాడ సురేశ్ రెడ్డిలతో పాటు మరికొంత మందిని కలిసినట్లు సమాచారం. వారి నిర్ణయం ప్రకటించకపోయినా ఎలాగైనా వారికి తీసుకొచ్చేలా వ్యూహం పన్నుతున్నారు. మొత్తంగా రేవంత్ ఇంటగెలిచి రచ్చ గెలవాలి అన్న సామెతను బాగా వాడుకుంటున్నట్లు తెలుస్తోంది.

Back to top button