టాలీవుడ్వీడియోలుసినిమా

పారాసిటమాల్… బ్లీచింగ్ పౌడర్.. ఆర్జీవీ ‘కరోనా’ ట్రైలర్


రామ్‌గోపాల్ వర్మ ఏం చేసినా సంచలనమే. సమజంలో జరిగే యాదార్థ సంఘటనల ఇతివృత్తంగా సినిమాలు తీయడంలో ఆర్జీవీని మించిన వాళ్లు లేరు. రక్తచరిత్ర, వంగవీటి, లక్ష్మీస్‌ ఎన్టీఆర్, అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు.. అదే కోవలోకి చెందిన చిత్రాలు. మరెన్నో సినిమాలు, సిరీస్‌లు ప్రకటించినా అవి మరుగునపడిపోవడం వేరే విషయం అనుకోండి. ఈ మధ్యే అమెరికా పోర్న్ స్టార్ మియా మాల్కోవాతో ‘క్లైమాక్స్‌’ సినిమా టీజర్, ట్రైలర్,మ్యూజికల్ వీడియోతో హల్‌చల్‌ చేసిన ఆర్జీవీ ఇప్పుడు కరోనాపై పడ్డాడు. ఈ విశ్వాన్ని వణికిస్తున్న ప్రాణాంతక వైరస్‌పై ప్రపంచంలోనే తొలి సినిమాను రాము ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు. ఆర్జీవీ శిష్యుడు ఆగస్త్య మంజు డైరెక్షన్‌లో ‘కరోనా వైరస్’ టైటిల్‌లో రూపొందించించాడు.

ఈ చిత్రం ట్రైలర్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఏకంగా నాలుగు నిమిషాల నిడివి ఈ ఉన్న ఈ ట్రైలర్ను గమనిస్తే.. లాక్‌డౌన్‌ కారణంగా ఇంటికి పరిమితమైన కుటుంబంలో కరోనా కారణంగా ఎలాంటి మార్పులు జరిగాయో చెప్పేలా ఉంది. కరోనా కేసులు రోజు రోజుకూ పెరిగిపోతుండగా.. ఆ ఇంట్లో ఓ అమ్మాయి తీవ్రంగా దగ్గుతూ ఉంటుంది. దాంతో, వాళ్ల నాన్నతో పాటు అందరిలో భయం మొదలవుతుంది. ఆమెకు కరోనా వచ్చిందేమో అని సోదరుడు సెటైర్ వేస్తే.. అన్ని జాగ్రత్తలు పాటిస్తూ మనకు రాదని తండ్రి ధైర్యం చెబుతాడు. ఆపై, ఇంట్లో ఓ వృద్ధురాలు కూడా దగ్గడంతో అందరూ వారికి దూరంగా ఉంటారు. చివరకు భార్యాభర్తలు కూడా దూరంగా పడుకుంటారు. ఆపై, కుటుంబ సభ్యులంతా మొబైల్ ఫోన్‌ చూస్తుండగా..కరోనా వ్యాప్తి మొదట్లో తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు చేసిన కామెంట్స్‌ పెట్టాడు ఆర్జీవీ. పారాసెటమాల్ వేసుకుంటే కరోనా తగ్గిపోతుందని కేసీఆర్, బ్లీచింగ్ పౌడర్ చల్లితే చాలాని జగన్‌ చెబుతున్న మాటలను కుటుంబ సభ్యులను ఆశ్చర్యంగా చూస్తుండంతో ట్రైలర్ ముగుస్తుంది.

కరోనా వైరస్‌ కంటే సినిమా ట్రైలరే ఎక్కువ భయపెట్టేలా ఉందని ఫ్యాన్స్ కమెంట్లు పెడుతున్నారు. ఇక, ఈ సినిమా మొత్తం లాక్‌డౌన్‌లోనే చిత్రీకరించినట్టు ఆర్జీవీ చెప్పడం మరో విశేషం. దీనిపై ట్విట్టర్లో మరోసారి క్లారిటీ ఇచ్చాడు. ‘ గైడ్‌లైన్స్‌ను పాటిస్తూ కరోనా వైరస్‌ ఫిల్మ్ మొత్తాన్ని లాక్‌డౌన్‌లో షూట్ చేశాం. ఈశ్వర్, అల్లా, జీసస్‌తో పాటు ప్రభుత్వం మీద ఒట్టేసి చెబుతున్నా ఇది నిజం’ అని ట్వీట్ చేశాడు.