ఆరోగ్యం/జీవనం

గంజి తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మీకు తెలుసా..?

Rice Water Benefits

చాలా సందర్భాల్లో బియ్యాన్ని ఉడికిస్తే అన్నం ఉడికిన తర్వాత మిగిలిన నీటిని పారబోయడం జరుగుతుంది. ఆ నీళ్లనే మనం గంజి అని అంటాం. అయితే గంజి వల్ల మన శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. జుట్టు, చర్మ సంబంధిత సమస్యలకు చెక్ పెట్టడంలో గంజి ఎంతగానో సహాయపడుతుంది. మొటిమల సమస్యతో బాధ పడేవాళ్లు గంజి తాగితే మంచిది. మొటిమల వల్ల ఏర్పడే ఎరుపు మచ్చలు, వాపు, దురదలను తొలగించడంలో గంజి తోడ్పడుతుంది.

Also Read: జీలకర్ర నీటితో సులభంగా బరువు తగ్గవచ్చు.. ఎలా అంటే..?

గంజి కొత్త మచ్చలను ఏర్పడకుండా నిరోధించడంతో పాటు రాత్రి పడుకునే సమయంలో ముఖంలో గ్లో పెరిగేలా చేయడంలో సహాయపడుతుంది. గంజి స్కిన్ టోనర్ గా కూడా పని చేసి ముడతల బారిన పడకుండా ముఖాన్ని రక్షిస్తుంది. గంజిని కాటన్ బాల్ లో తీసుకుని ముఖంపై మెత్తగా పూసుకుని ఆరనిస్తే ముఖంపై ముడతలు తొలగిపోతాయి. జుట్టు రాలడం లాంటి సమస్యలతో బాధ పడేవాళ్లకు గంజి మంచి మెడిసిన్ లా పని చేస్తుంది.

Also Read: కీళ్ల నొప్పులకు సులువుగా చెక్ పెట్టే ఆహార పదార్థాలివే..?

గంజిలో ఉండే అమైనో ఆమ్లాలు జుట్టు రాలడాన్ని నివారించడంతో పాటు గంజి విటిమిన్ బి, సి, ఈలను కలిగి ఉంటుంది. జుట్టు పెరుగుదలకు ఉపకరించడంలో గంజి సహాయపడుతుంది. గంజి ఇన్ ఫెక్షన్ సోకకుండా కాపాడటంతో పాటు గంజిలో ఉండే కార్బోహైడ్రేట్లు తక్షణ శక్తిని ఇవ్వడంలో సహాయపడతాయి. గంజి మలబద్ధకం సమస్యను తొలగించడంతో పాటు జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది.

శరీరంలో జీవక్రియ రేటును పెంచడంలో గంజి తోడ్పడుతుంది. కాలానుగుణ ఇన్ఫెక్షన్ లేదా వైరల్ జ్వరం సమయంలో గంజి తాగడం వల్ల డిహైడ్రేషన్ సమస్య బారిన పడే అవకాశం ఉండదు. వేసవిలో గంజి డిహైడ్రేషన్ నుంచి కాపాడటంలో తోడ్పడుతుంది.

Back to top button