టాలీవుడ్సినిమాసినిమా వార్తలు

వంట పాత్రలతో తంటాలు పడుతున్న రీతూ వర్మ

2005 లో వచ్చిన గజినీ చిత్రంలో హీరోయిన్ ఆసిన్ ” ఇప్పుడిప్పుడే ఆడవాళ్ళు వంట గది నుండి బయటకు వస్తున్నారు రా ..మళ్ళీ మమ్మల్ని వంటగది లోకి పంప కండిరా ” అంటూ విలన్ ని రిక్వెస్ట్ చేస్తుంది. అప్పట్లో ఆ డైలాగ్ ప్రేక్షకుల ఫై చాలా ఇంపాక్ట్ చూపించింది అదలా వుంటే నేటి యువ హీరోయిన్ రీతువర్మ మాత్రం మళ్ళీ వంటగదికి పరిమితమవుతోంది.

ఆశ్చర్య పడకండి ఇది నిజజీవితంలో కాదు. రీతు వర్మ ఒప్పుకొన్న తాజా చిత్రం కోసం అలా వంటింటి కుందేలు గా మారింది. అందుకోసం రకరకాల రెస్టారెంట్లలో చెఫ్ లను పరిశీలిస్తూ.. కిచెన్ లోకి వెళ్ళి వాళ్ళ పనితీరును అబ్జర్వ్ చేస్తోందట. చాలా తక్కువ మంది మెథడ్ యాక్టర్స్ మాత్రమే పాటించే పద్ధతి ఇది. తెలుగులో ఎస్ వి రంగారావు ,సావిత్రి వంటి వారు అలా చేసే వారు. ఇలా అబ్జర్వ్ చేయడం వల్ల సినిమాలో నటిస్తున్నట్లు కాక బిహేవ్ చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. ప్రేక్షకులు కూడా క్యారెక్టర్ కి బాగా కనెక్ట్ అవుతారు. రీతువర్మ వర్క్ డెడికేషన్ చూసిన దర్శక ,నిర్మాతలు ఫుల్ హ్యాపీ గా ఉన్నారట …

రీసెంట్ గా వచ్చిన “కనులు కనులను దోచాయంటే” అనే ద్విభాషా చిత్రం తో కమర్షియల్ గా మంచి సక్సెస్ సొంతం చేసుకున్న రీతువర్మ ప్రస్తుతం తెలుగులో రెండు సినిమాలు చేస్తోంది. అయితే ఆమె చియాన్ విక్రమ్ తో చేసిన డ్రీమ్ ప్రొజెక్ట్ “ధృవ నక్షత్రం” మాత్రం విడుదలకు నోచుకోలేదు. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఫైనాన్షియల్ ఇష్యూస్ కారణంగా విడుదలకు నోచుకోలేక పోయింది..“పెళ్ళిచూపులు” చిత్రం తరవాత పెద్దగా పుంజుకొని రీతూ కెరీర్ ఇప్పుడు ” కనులు కనులను దోచాయంటే “సక్సెస్ తో తెలుగు-తమిళ భాషల్లో బాగా పెరిగింది ఇదే స్పీడ్ తో వెళ్తే రీతు వర్మ స్టార్ హీరోయిన్ గా ఎదగడం తొందర్లోనే చూస్తాం.
If you work sincere ,,success follows

Back to top button