సినిమాసినిమా వార్తలు

దసరా నుంచి సంక్రాంతికి ఆర్ఆర్ఆర్.. మహేష్ వెనక్కి

RRR from Dussehra to Sankranthi .. Mahesh back

RRR

కరోనా ఎంత పనిచేస్తోంది. టైంకు కుదుర్చుకున్న సినిమాలన్నీ వాయిదా పడేలా చేస్తోంది. గత ఫిబ్రవరిలో సినిమా రంగం పట్టాలెక్కింది. ఉప్పెనతో బ్లాక్ బస్టర్ హిట్ నమోదు చేసి టాలీవుడ్ పట్టాలెక్కింది. ఆ తర్వాత జాతిరత్నాలు, వకీల్ సాబ్ తో ఇక ఇండస్ట్రీ కోలుకుందని అనుకున్నారు.

కానీ ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ తో వకీల్ సాబ్ తో రిలీజ్ కావాల్సిన అన్ని సినిమాలు వాయిదా పడ్డాయి. మళ్లీ లాక్ డౌన్ లు , కర్ఫ్యూలు. దీంతో ఇక థియేటర్లపై ఆంక్షలు.. 50శాతం అక్యూపెన్సీలు రాబోతున్నాయి.

సినిమాలన్నీ వాయిదాపడడంతో దిగ్గజ దర్శకుడు రాజమౌళి తీస్తున్న ఆర్ఆర్ఆర్ పై కూడా దీని ప్రభావం పడుతోంది. అన్ని సినిమాలు వెనక్కి జరగడం.. థియేటర్లకు స్పెషల్ షోలు, రేట్లు పెంచుకునే వెసులుబాటు అప్పటికి ఉంటుందో లేదో తెలియకపోవడంతో ఆర్ఆర్ఆర్ ను వాయిదా వేయాలని డిసైడ్ అయినట్లు సమాచారం.

నిజానికి ఆర్ఆర్ఆర్ లోని నటులకు కూడా కరోనా సోకింది. ఆలియా భట్ కరోనాతో షూటింగ్ ఆలస్యమైంది. ఇక రాంచరణ్ కు ఆ మధ్య కరోనాతో షూటింగ్ అంతా ఆలస్యమైంది. ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ నుంచి బయటకు వచ్చి ఇప్పుడు టీవీ షోతోపాటు కొరటాల సినిమాను చేస్తున్నారు.

దీంతో ఆర్ఆర్ఆర్ షూటింగ్ కంప్లీట్ అయ్యిందా? లేదా. ? దసరాకే వస్తుందా? లేదా అన్నది డౌట్ గా మారింది. రాజమౌళి ఆలోచన ప్రకారం దసరా నుంచి వచ్చే 2022 సంక్రాంతికి ‘ఆర్ఆర్ఆర్’ పోస్ట్ పోన్ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే అదే జరిగితే సంక్రాంతికి అనుకున్న మహేష్, పవన్ కళ్యాణ్ సినిమాలు ముందుకు, వెనక్కి జరిగే అవకాశాలున్నాయి. మహేష్ బాబు డిసెంబర్ లతో తన ‘సర్కారివారి పాట’ సినిమాను వెనక్కి జరిపేందుకు డిసైడ్ అయినట్లు సమాచారం.

Back to top button