అత్యంత ప్రజాదరణప్రత్యేకంబ్రేకింగ్ న్యూస్బ్రేకింగ్స్సినిమా బ్రేకింగ్ న్యూస్సినిమా వార్తలు

ఆర్ఆర్ఆర్ రాంచరణ్ ఫస్ట్ లుక్: వీరోచిత ‘రామా’

RRR Poster: Ram Charan Looks Incredible

రాజమౌళి చెక్కుతున్న ఆర్ఆర్ఆర్ చిత్రం నుంచి మరో అద్భుతం వచ్చేసింది. రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా అతడి ఫస్ట్ లుక్ విడుదలైంది. అభిమానులు ఆసక్తిగా ఎదురుచూసిన ఈ కొత్త పోస్టర్‌ మెగా ఫ్యాన్స్ ను గూస్ బాంబ్స్ తెప్పించేలా ఉంది.

ఆర్‌ఆర్‌ఆర్ నుంచి తాజాగా రామ్ చరణ్ పోషిస్తున్న అల్లూరి సీతారామ రాజు పాత్ర కొత్త పోస్టర్ ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ఈ చిత్ర నిర్మాతలు విడుదల చేశారు. ఈ మేరకు పోస్టర్ ను ట్వీట్ చేశారు.

RRR ట్వీట్ చేస్తూ “వేడుకలు కొంచెం ముందుగానే ప్రారంభమవుతాయి. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు రాంచరణ్ కొత్త అవతార్‌లో కనిపిస్తాడు. ప్రేక్షకులను కలవడానికి సిద్ధంగా ఉండండి.కాగా భయంకరమైన రూపంలో ఉగ్రంగా ఊగిపోతున్న అల్లూరి సీతారామరాజు ఫస్ట్ లుక్ ప్రేక్షకులను మంత్రముగ్దులను చేయటానికి బయలుదేరుతున్నాడు. ” అని ట్వీట్ లో పేర్కొంది.

అలియా భట్ పుట్టినరోజు సందర్భంగా, ఆర్ఆర్ఆర్ బృందం యొక్క నిర్మాతలు ఈ చిత్రం నుండి సీత యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఇటీవలే పంచుకున్నారు. ఇప్పుడు అల్లూరి పోస్టర్ కూడా అంతకుమించినట్టు ఉంది.

టాలీవుడ్ టాప్ డైరెక్టర్ ఎస్ రాజమౌలి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ రూపొందుతోంది. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అలియా భట్ మరియు ఒలివియా మోరిస్ హీరోయిన్లు. అజయ్ దేవ్‌గన్, రే స్టీవెన్సన్, అలిసన్ డూడీ ఈ చిత్రంలో ప్రముఖ పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రం చారిత్రక నేపథ్యంలో తెరకెక్కుతోంది. అల్లూరి సీతారామ రాజు పాత్రలో రాంచరణ్.. కొమరం భీమ్ గా ఎన్టీఆర్ భారతదేశంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఎలా పోరాడారనేది కథాంశం.

Back to top button