టాలీవుడ్సినిమా

ఐదు రోజుల్లో ఎన్టీఆర్ వచ్చేస్తున్నాడు !


పాన్ ఇండియా డైరెక్టర్ రాజమౌళి డైరెక్షన్ లో ‘ఎన్టీఆర్ – రామ్ చరణ్’ హీరోలుగా రానున్న క్రేజీ భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. కాగా మరో ఐదు రోజుల్లో ‘రామరాజు ఫర్ భీమ్’ రాబోతుందని మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేస్తూ ట్వీట్ చేశారు. మొత్తానికి దసరాకి తారక్ పాత్ర మీద జక్కన్న ఫస్ట్ లుక్ వీడియోను రిలీజ్ చేస్తున్నాడు అన్నమాట. గత కొన్ని నెలలుగా ఈ వీడియో కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర ఎలా ఉండబోతోంది.. తారక్ గెటప్ ఎలా ఉండనుందని తారక్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఉన్నారు.

Also Read: వైరల్: పెళ్లి తర్వాత తొలి ఫొటో.. రానా-మిహీక హనీమూనా?

అయితే ఎన్టీఆర్ ఈ సినిమాలో మొత్తం మూడు గెటప్స్ లో కనిపిస్తాడని.. ఎన్టీఆర్ మూడు గెటప్స్ లో కనిపించడానికి ప్రధాన కారణం.. శత్రువులు గుర్తు పట్టకుండా ఉండటానికే అని ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఎన్టీఆర్ యాక్షన్ సీన్స్ ను అద్భుతంగా వచ్చేలా రాజమౌళి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడని.. అందుకే తారక్ కోసం ప్రత్యేకంగా డైలాగ్స్ కూడా రాయించాడని సమాచారం. ఎలాగూ తెలంగాణ యాస.. దీనికితోడు తారక్ మాడ్యులేషన్ కాబట్టి ఎన్టీఆర్ ఓ రేంజ్ లో డైలాగ్స్ చెప్పి ఉంటాడు. ఈ సినిమానికి కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే సాంగ్స్ తో పాటు చాలా వరకూ నేపథ్య సంగీతాన్ని కూడా కీరవాణి పూర్తి చేశాడట.

Also Read: విశాఖకు నో.. హైదరాబాద్ కే జై.. ‘మెగా’ స్టూడియోకు చిరంజీవి శ్రీకారం?

మొత్తానికి రాజమౌళి ఈ చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో రూపొందిస్తున్నాడు పైగా ‘బాహుబలి’ తరవాత రాజమౌళి చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పై అన్ని ఇండస్ట్రీల నుండి అత్యంత భారీ అంచనాలు ఉన్నాయి. అందుకే అవుట్ ఫుట్ విషయంలో ఎక్కడా విశ్వసనీయత తగ్గకుండా, ముఖ్యంగా ఖర్చుకు ఏ మాత్రం భయపడకుండా డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నాడు.

Back to top button