ఆంధ్రప్రదేశ్ప్రత్యేకంరాజకీయాలు

సంచలన వాంగ్మూలం: వైఎస్ వివేకా హత్యకు రూ.9 కోట్ల సుపారి?

Rs 9 crore supari for YS Viveka murder?

Big Deal For YS Viveka Reddy Murder

ఏపీ సీఎం జగన్ బాబాయ్ వైఎస్ వివేకానందారెడ్డి కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. సీబీఐ చేస్తున్న ఈ విచారణలో ఈరోజు కీలక పరిణామం సంభవించింది. తాజాగా కీలక ఆధారాన్ని సీబీఐ సంపాదించినట్టు తెలిసింది.

వైఎస్ వివేకాది సుపారీ హత్యగా సీబీఐ అధికారులు తేల్చారు. ఈ కేసులో వాచ్ మెన్ రంగయ్య వాంగ్మూలం ఇవ్వడంతో కేసు చిక్కుముడి దాదాపుగా విడిపోయినట్టు తెలుస్తోంది.

వైఎస్ వివేకా హత్య వెనుక 9మంది ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది. వారిలో ఇద్దరు ప్రముఖులు కూడా ఉన్నారని చెప్తున్నారు.

తాజాగా జమ్మలమడుగు మెజిస్ట్రేట్ ముందు వాచ్ మెన్ రంగయ్య ఇచ్చిన వాంగ్మూలం ఈ కేసులో కీలకంగా మారింది. వివేకా హత్య కోసం రూ.9 కోట్ల సుపారీ ఇచ్చినట్టు రంగయ్య స్టేట్ మెంట్ ఇచ్చాడని.. ఈ మేరకు జడ్జి రికార్డు చేశాడని ప్రధాన మీడియాలో వార్తలు వస్తున్నాయి.

వివేకాను ఎవరు చంపారు..? ఎందుకు చంపారు..? ఎవరు చంపించారు..? అందుకు దారితీసిన పరిస్థితులు ఏంటి..? ఈ ప్రశ్నలన్నింటికీ త్వరలోనే సమాధానం దొరకబోతున్నట్లు తెలుస్తోంది. సీబీఐ అధికారులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడం.. కొత్త బృందం రంగంలోకి దిగనుండటంతో కేసు డొంక కదలనున్నట్లు సమాచారం. అంతేకాదు.. ఇప్పటివరకు సాధారణ వ్యక్తులను ప్రశ్నిస్తూ సాగగా.. ఇకపై కొత్త వ్యూహంతో ముందుకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. రాజకీయ ప్రముఖులను కూడా ఆరా తీసేందుకు సీబీఐ ఆఫీసర్లు రంగం సిద్ధం చేశారట.

Back to top button