క్రీడలుజాతీయంరాజకీయాలు

కరోనా ఎఫెక్ట్: ఆస్పత్రికి సచిన్.. ఆందోళన

sachin tendulkar hospitalised for covid treatment

భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కు కరోనా తీవ్రత ఎక్కువ కావడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఇటీవలే కరోనా బారిన పడిన అతడు ఇంట్లోనే ఉండి వైద్యుల సూచనతో చికిత్స తీసుకుంటున్నాడు. అయితే కరోనా తగ్గకపోవడంతో తీవ్ర ఎక్కువ కావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. దీంతో క్రికెట్ అభిమానుల్లో ఆందోళన మొదలైంది.

కొద్దిసేపటి క్రితమే సచిన్ ట్వీట్ చేశాడు. ‘తాను త్వరగా కోలుకోవాలని అభిమానులు చేస్తున్న ప్రార్థనలకు.. వారు చూపిస్తున్న ప్రేమా అప్యాయతలకు ధన్యవాదాలు తెలిపారు. వైద్యుల సూచన మేరకు ఆస్పత్రిలో చేరానని.. సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి తిరిగి వస్తానని’ సచిన్ ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా 2011లో టీం ఇండియా రెండోసారి ప్రపంచకప్ గెలిచి నేటికి పదేళ్లు పూర్తి అయిన సందర్భంగా దేశ ప్రజలకు, సహచరులకు శుభాకాంక్షలు తెలిపారు.

మహారాష్ట్రలో కరోనా తీవ్రత అధికంగా ఉంది. మార్చి 27న సచిన్ కరోనా బారినపడ్డారు. వైద్యుల సూచన మేరకు హోం క్వారంటైన్ లో ఉన్నారు.

అంతకుముందు రాయ్పూర్ లో జరిగిన రోడ్ సేఫ్టీ సిరీస్ లో సచిన్ కెప్టెన్ గా ‘లెజెండ్స్’ టీంకు వ్యవహరించారు. ఈ టోఫ్రీని గెలిచారు. టీమిండియా మాజీ ఆటగాళ్లు అందరూ ఈ సిరీస్ లో పాల్గొన్నారు. ఈ సిరీస్ లో ఆడిన యూసుఫ్ పఠాన్, ఇర్ఫాన్ పఠాన్ సైతం కరోనా బారినపడ్డారు. సచిన్ ఆరోగ్యంపై ప్రస్తుతం ఆందోళన నెలకొంది. ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు.

Back to top button