టాలీవుడ్సినిమాసినిమా వార్తలు

Sai Dharam Tej Incident: ఎవడైతే నాకేంటి ? రెచ్చిపోతున్న నరేష్ !

సాయి తేజ్ కి జరిగిన ప్రమాదం పై సీనియర్ నరేష్ కామెంట్స్ చేయడం, ఆ కామెంట్స్ కాస్త కొంత ఇబ్బంది కరంగా ఉండటంతో

Sai Dharam Tej Incident: Actor Naresh Counter To Hero Srikanth

Sai Dharam Tej Incident: సాయి తేజ్ కి జరిగిన ప్రమాదం పై సీనియర్ నరేష్ కామెంట్స్ చేయడం, ఆ కామెంట్స్ కాస్త కొంత ఇబ్బంది కరంగా ఉండటంతో మొత్తానికి కొంతమంది సినీ ప్రముఖులు నరేష్ పై సీరియస్ అయ్యారు. హీరో శ్రీకాంత్ కూడా నరేష్ పై కొన్ని విమర్శలు చేశారు. అయితే, ‘హీరో శ్రీకాంత్ చిన్న పిల్లాడిలా మాట్లాడాడు’ అంటూ నరేష్ రెచ్చిపోయాడు.

నరేష్ మాటల్లోనే ‘ఏమ్మా శ్రీకాంత్. నీ బైట్ చూశాను. అలా ఇచ్చావేంటమ్మా. మంచి సినిమాలు చేశావు. నా కళ్ల ముందు నువ్వు హీరో అయ్యావు. మా ఎలక్షన్స్ ‏లో నా అపోజిట్ ప్యానెల్ లో పోటీ చేసి ఓడిపోయావు. బైట్స్ ఇచ్చే ముందు ఆలోచించి, ఒకసారి పెద్దవారితో చర్చించి మాట్లాడు. 50 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నాను. సినిమా ఇండస్ట్రీలో పుట్టి పెరిగాను’ ఇలా సాగింది నరేష్ స్పీచ్.

అయితే నరేష్ మాటలు విన్న వారంతా ఇదేం విడ్డూరం అంటూ ఆశ్చర్యపోతున్నారు. నరేష్ మాటల్లో చాలా స్పష్టంగా కొంత అహంకారం కనిపిస్తోంది. శ్రీకాంత్ అనే అతని కంటే నేను సీనియర్ హీరోని, పైగా నేను ఇండస్ట్రీలో పుట్టి పెరిగాను, అలాగే సినిమా పరిశ్రమకు మా ఫ్యామిలీ చాలా మేలు చేసింది అన్నట్టు సాగింది నరేష్ స్పీచ్.

ఏది ఏమైనా నరేష్ ఇలా సంబంధం లేకుండా శ్రీకాంత్ కి కౌంటర్ ఇచ్చారు. పనిలో పనిగా సాయితేజది యాక్సిడెంట్ అని, అయితే మీడియాలో నేను చెప్పింది తప్పుగా వచ్చింది అని, అందుకే మళ్ళీ నేను దానికి వివరణ కూడా ఇచ్చాను’ అని నరేష్ తనను తానూ సమర్ధించుకున్నారు.

మొత్తానికి నరేష్ ఎక్కడ తగ్గట్లేదు. మొత్తమ్మీద నరేష్ లో ఎవడైతే నాకేంటి అనే ధోరణి బాగా కనిపిస్తోంది.

Back to top button