టాలీవుడ్సినిమాసినిమా వార్తలు

ఆమె గ్రేసే ఆ డైరెక్టర్ కి ప్లస్ !

Love Story
సెన్సిబుల్ డైరెక్టర్ గా శేఖర్ కమ్ములకు టాలీవుడ్ లో మంచి పేరు ఉంది. ముఖ్యంగా బలమైన ఎమోషనల్ కథలతో ఆయన సినిమాలు చేస్తాడు, పైగా ఫ్యామిలీ మొత్తం వెళ్లి హ్యాపీగా ఎలాంటి ఇబ్బంది లేకుండా సినిమా చూడొచ్చు అనే బ్రాండ్ ఉంది. అందుకే శేఖర్ కమ్ములకు మంచి డిమాండ్. అయితే తాజాగా నాగచైతన్య హీరోగా ఆయన చేస్తోన్న ‘లవ్ స్టోరీ’ సినిమాకి మాత్రం పెద్దగా డిమాండ్ లేకుండా పోయింది. సినిమా టీజర్ లో ఫిదా సినిమా పోలికలు కనిపించడంతో.. మొత్తానికి లవ్ స్టోరీ పై నెగిటివ్ టాక్ బయటకు వచ్చింది.

Also Read: ‘ఆచార్య’ పై మెగాస్టార్ కి అనుమానం !

దానికి తగ్గట్లు సినిమా ఫస్ట్ కాపీ రెడీ అయ్యాక, సన్నిహితులకు అలాగే కొంతమంది సినిమా వాళ్లకు ఈ సినిమా ప్రివ్యూ కూడా వేశారు. ఈ సినిమా చూసినవారు సినిమా స్లోగా ఉంది, అలాగే బోర్ గా ఉంది అని చెప్పడంతో ఇక ఈ సినిమా పై ఎలాంటి క్రేజ్ లేకుండా పోయింది. ఇలాంటి పరిస్థితులో ఈ సినిమా నుండి “సారంగి దరియా” పాట వచ్చింది. ఈ పాట దెబ్బకు సినిమా పై అంచనాలు భారీ స్థాయిలో క్రియేట్ అయ్యాయి. అయితే ఈ క్రెడిట్ సాయి పల్లవికే దక్కుతుంది. ఆమె వేసే డ్యాన్స్ స్టెప్పుల్లో ఒక గ్రేస్ ఉంటుంది.

Also Read: ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ !

ఆ గ్రేసే ఇప్పుడు లవ్ స్టోరీకి బాగా హెల్ప్ అవుతుంది. గతంలో సాయి పల్లవి “వచ్చిండే” (ఫిదా) సాంగ్ అయినా, “రౌడీ బేబీ” సాంగ్ అయినా జనాలకి బాగా ఎక్కేశాయి. అందువల్లే ఆయా సినిమాలు కూడా జనాల్లోకి వెళ్లిపోయాయి. ఇప్పుడు “సారంగి దరియా” కూడా సాయి పల్లవి డ్యాన్స్ వల్ల జనంలోకి వెళ్లేలా ఉంది. పైగా ఫోక్ సాంగ్ ఛాయలతో ట్యూన్ చేసిన ఈ సాంగ్ క్యాచీగా ఉంది. అందుకు తగ్గట్లు సాయి పల్లవి డ్యాన్స్ స్టెప్పులు కూడా బాగుండటంతో ఈ సాంగ్ బాగా వైరల్ అవుతుంది. మొత్తానికి మరోసారి శేఖర్ కమ్ములను సాయిపల్లవి ఆదుకునేలా కనిపిస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

Back to top button