విద్య / ఉద్యోగాలు

స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాలో 320 ఉద్యోగాలు.. భారీ వేతనంతో..?

SAI Recruitment 2021

న్యూఢిల్లీలోని స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా నిరుద్యోగులకు తీపికబురు అందించింది. 320 ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా దరఖాస్తులను కోరుతోంది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ ఉద్యోగాల భర్తీ జరుగుతుండటం గమనార్హం. ఆన్ లైన్ లో మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మే నెల 20వ తేదీ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది.

https://sportsauthorityofindia.nic.in/ వెబ్ సైట్ ద్వారా ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. మొత్తం 320 ఉద్యోగాలలో కోచ్ ఉద్యోగ ఖాళీలు 100 ఉండగా అసిస్టెంట్ కోచ్ ఉద్యోగ ఖాళీలు 220 ఉన్నాయి. కోచ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వాళ్లకు వయస్సు 45 సంవత్సరాలకు మించకూడదు. షార్ట్‌లిస్టింగ్, సంబంధిత విభాగం (స్పోర్ట్స్‌) ద్వారా ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.

100 ఉద్యోగ ఖాళీలలో వెయిట్‌లిఫ్టింగ్, వ్రెజ్లింగ్, సైక్లింగ్, రోయింగ్, స్విమ్మింగ్, ఫుట్‌బాల్, ఆర్చరీ, అథ్లెటిక్స్, బాక్సింగ్, హాకీ, షూటింగ్, ఇతర విభాగాలు ఉన్నాయి. ఒలింపిక్ లేదా అంతర్జాతీయ ప్రదర్శన చేసిన వాళ్లు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 220 అసిస్టెంట్ కోచ్ ఉద్యోగ ఖాళీలు ఉండగా వ్రెజ్లింగ్, సైక్లింగ్, రోయింగ్, స్విమ్మింగ్, ఫుట్‌బాల్, ఆర్చరీ, అథ్లెటిక్స్, బాక్సింగ్, హాకీ, షూటింగ్, వెయిట్‌లిఫ్టింగ్ ఇతర క్రీడా విభాగాలకు చెందిన వాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

40 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి. నాలుగేళ్ల అనుభవం ఉండి కోచింగ్ లో డిప్లొమా ఉత్తీర్ణులైన వాళ్లు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. షార్ట్‌లిస్టింగ్, స్పోర్ట్స్ విభాగం ద్వారా ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.

Back to top button