విద్య / ఉద్యోగాలు

స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాలో ఉద్యోగాలు.. భారీ వేతనంతో..?

Sail Recruitment 2021

స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్ తాజాగా జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. మొత్తం 46 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్ విడుదల కాగా ఈ ఉద్యోగాలలో మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులు 26 ఉంటే మెడికల్‌ స్పెషలిస్ట్‌ పోస్టులు 20 ఉండటం గమనార్హం. వచ్చే నెల 1వ తేదీ నుంచి ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు మే నెల 7వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

Also Read: నిరుద్యోగులకు రూ.1.80 లక్షల వేతనంతో ఉద్యోగాలు.. బీటెక్ అర్హతతో..?

అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. https://www.sailcareers.com/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన వివరాలను తెలుసుకోవచ్చు. 41 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. బీడీఎస్‌, సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ లేదా డీఎన్‌బీ చదివి అనుభవం ఉన్నవాళ్లు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి.

Also Read: డిగ్రీ పాసైన వాళ్ళకు శుభవార్త.. భారీ వేతనంతో ప్రభుత్వ ఉద్యోగాలు..?

ఆసక్తి ఉన్నవాళ్లు వెబ్ సైట్ నుంచి దరఖాస్తు ఫామ్ ను డౌన్ లోడ్ చేసుకుని నోటిఫికేషన్ కు అవసరమైన సర్టిఫికెట్లను జతచేసి కోల్ కతాలోని సెయిల్ అడ్రస్ కు పంపాల్సి ఉంటుంది. ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి సందేహాలు ఉన్నా కంపెనీ వెబ్ సైట్ ద్వారా సులభంగా నివృత్తి చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ ఉద్యోగాలకు పోటీ తక్కువగానే ఉండే అవకాశం ఉంది.

కంపెనీ వెబ్ సైట్ ద్వారా ఉద్యోగ నోటిఫికేషన్ ను డౌన్ లోడ్ చేసుకొని ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన వివరాలను తెలుసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి అర్హత, అనుభవం ఆధారంగా వేతనం లభిస్తుంది

Back to top button