టాలీవుడ్సినిమా

10 ఏళ్లు.. 11 మిలియన్ల ఫాలోవర్లు


టాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్‌గా వెలుగొందుతున్న అక్కినేని సమంత ఇండస్ట్రీలో అడుగుపెట్టి పదేళ్లు అవుతోంది. ఆమె మొదటి సినిమా ‘ఏం మాయ చేశావే’ 2010లో రిలీజైంది. అక్కడి నుండి ఈ మధ్య వచ్చి ‘జాను’ వరకూ ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో టాలీవుడ్‌పై తనదైన ముద్ర వేసిందామె. గ్లామర్రోల్స్‌తో పాటు నటనకు ఆస్కారం ఉన్నా చిత్రాలు, నాయికా ప్రాధాన్యం ఉన్న చిత్రాలతో మెప్పించింది. అందం, నటనతోనే కాకుండా సామాజిక కార్యక్రమాలతో కూడా మంచి పేరు తెచ్చుకుంది. ప్రత్యూష ఫౌండేషన్‌ ద్వారా ఎంతో మంది అనాథ చిన్నారులకు ఆపన్న హస్తం అందిస్తోందామె.

Also Read: నా కొత్త మూవీ టైటిల్ ని‌ గెస్‌ చేయండి: ఆదా శర్మ

అన్నింటికి మించి వివాదాలకు, విమర్శలకు దూరంగా ఉంటుంది. మొహంపై ఎప్పటికీ చెరగని చిరునవ్వుతో అందరినీ ఆప్యాయంగా పలకరిస్తుంది. దాంతో, తెలుగు నాటే కాదు తమిళ్‌లో కూడా సమంతకు విపరీతమైన ఫాలోయింగ్‌ ఏర్పడింది. సోషల్‌ మీడియా పరిధి పెరిగిన తర్వాత రెగ్యులర్ అప్‌డేట్స్‌తో ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటోందామె. సినిమాలతో పాటు పర్శనల్ విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటోంది. వీలుచిక్కినప్పుడల్లా లైవ్‌లోకి వస్తూ ఫ్యాన్స్‌ అడిగిన ప్రశ్నలకు సరదాగా సమాధానాలు ఇస్తోంది.

దాంతో, సోషల్ మీడియాలో సమంతను అనుసరించే అభిమానుల సంఖ్య అమాంతం పెరిగింది. ఒక్క ఇన్‌స్టాగ్రామ్‌లోనే సమంత ఫాలోవర్ల సంఖ్య ఇంతితై అన్నట్టు కోటి దాటి ఎప్పుడో దాటింది. లేటెస్ట్‌గా ఆమె ఇన్‌స్టా ఖాతాలో ఫాలోవర్స్‌ నంబర్ 11 మిలియన్ల మార్కు చేరింది. అంటే కోటి పది లక్షల మంది ఆమెను ఫాలో అవుతున్నారు. ఈ మార్కు చేరడం పట్ల సమంత ఎంతో సంతోషం వ్యక్తం చేసింది. అభిమానులందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ప్రత్యేక వీడియో ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది.

Also Read: గెటప్‌ మార్చేసి.. మాస్‌ ట్రాక్‌లోకి నాగశౌర్య

తన మొదటి సినిమా, అది వచ్చిన ఏడాది నుంచి పలు చిత్రాల్లోని ఫొటోలతో పాటు ఆయా ఇయర్స్‌లో తన ఫాలోవర్ల సంఖ్యను తెలుపుతూ చేసిన వీడియోను అభిమానులతో పంచుకుంది. దానికి ‘మంచి వాళ్లతో మంచి ప్రయాణం. నాతో ఎప్పటికి ఉంటే టీమ్‌ ఇది. 11 మిలియన్ల స్ట్రాంగ్‌ టీమ్‌. అది ఇంకా బలపడుతూనే ఉంది. ఈ ప్రయాణంలో ఎన్నో అప్స్‌, డౌన్స్‌.. గుడ్‌, బ్యాడ్‌. అన్ని సమయాల్లో మీరు నాకు తోడుగా ఉన్నట్టు నేను కూడా మీకు తోడుగా ఉన్నానని భావిస్తున్నా’ అని రాసుకొచ్చింది.

Tags
Show More
Back to top button
Close
Close